ETV Bharat / city

Bathukamma: మూడో రోజు దిల్లీలో ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలు.. - ap lo bathukamma program

third day of the grand Bathukamma festival in Delhi: తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ముద్దపప్పు బతుకమ్మగా పిలిచే మూడోరోజు వేడుకల్లో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రకరకాల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు.

Bathukamma festival
రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు
author img

By

Published : Sep 28, 2022, 12:53 PM IST

third day of the grand Bathukamma festival

third day of the grand Bathukamma festival: బతుకమ్మ సంబురాలు సందడిగా సాగుతున్నాయి. తొలిసారి దిల్లీలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించింది. కిషన్‌రెడ్డి నివాసం అశోకరోడ్- 6లో మహిళలు బతుకమ్మలు పేర్చారు. అనంతరం కిషన్‌రెడ్డి నివాసం నుంచి ఇండియా గేట్ వరకు బతుకమ్మల ఊరేగింపు నిర్వహించారు. ఈ వేడుకకు కేంద్రమంత్రులు, దిల్లీలోని తెలుగు మహిళా సంఘాలు, మహిళా ఐఎస్​,ఐపీఎస్​ అధికారులు పాల్గొన్నారు.

ఇండియా గేట్ వద్ద ఘనంగా నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం: కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. తన నాన్నమ్మ ఇందిరాగాంధీ 1978లో వరంగల్‌లో జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న ఫోటోను ట్వీట్‌కు జతచేశారు. తన నానమ్మ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఒక మధురస్మృతిగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ సంతోషాన్నికలిగించాలని కోరుకుంటున్నట్లు ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.

తెలంగాణ భవన్‌లో: కేసీఆర్ కేంద్ర రాజకీయాల వైపు చూస్తున్నారనగానే దిల్లీలో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పతాకం దిల్లీలో ఎగిరే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. తెలంగాణ భవన్‌లో తెరాస మహిళావిభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో ఆమె పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచ వ్యాప్తం కావాలని ఎమ్మెల్సీ వాణిదేవి ఆకాంక్షించారు.

రవీంద్రభారతిలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన సంబురాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన నృత్యాంశాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఖైరతాబాద్‌లోని హోటల్ మేనేజ్‌మెంట్ కశాళాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది.

కాలు కదిపిన కలెక్టర్​: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వేడుకలకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జగిత్యాల డీఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కరీంనగర్‌లోని ఆల్ఫోర్స్ పాఠశాలలు, కళాశాల యాజమాన్యం ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో విద్యావికాస్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉత్సవాల్లో విద్యార్థినులు పాల్గొని నృత్యాలు చేశారు. ఖమ్మంలో బతుకమ్మను పేర్చి మహిళలు పూజలు చేశారు. ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌లో సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ బతుకమ్మ ఆడిపాడారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.