POCSO Court: కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ సవతి తండ్రికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. కాచిగూడ ఇన్‌స్పెక్టర్ హబీబుల్లాఖాన్ కథనం ప్రకారం.. ఏపీలోని మంత్రాలయానికి చెందిన వివాహిత భర్త చనిపోవడంతో మహమ్మద్ జహంగీర్(35) ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు 13 ఏళ్ల కుమార్తె ఉంది. ఉపాధికి హైదరాబాద్‌కు వచ్చి బర్కత్‌పురలోని అపార్ట్‌మెంట్‌కు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. భార్య ఇళ్లలో పాచి పని చేయడానికి ఉదయం వెళ్లేది.
ఆ సమయంలో మహమ్మద్ జహంగీర్ కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంబర్‌పేటలో ఉండే అతని తమ్ముడు మహమ్మద్ భాషా(32) సైతం అత్యాచారం చేశాడు. 2017లో బాలిక చదివే పాఠశాల ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేశారు. పదో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కవిత మహమ్మద్ జహంగీర్‌కు 20 ఏళ్ల జైలు, రూ. 5 వేల జరిమానా, అతని సోదరుడు మహమ్మద్ భాషాకు మూడేళ్ల జైలు, రూ. 5 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చారు.
ఇవీ చదవండి :