పాఠశాల విద్యార్థులకు ఇచ్చే ప్రతిభా పురస్కారాల పేరును వైఎస్ఆర్ విద్యా పురస్కారాలుగా మారుస్తూ జారీ చేసిన జీవోను ప్రభుత్వం రద్దు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ జీవోను రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రతిభా పురస్కారాలను మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరిటే కొనసాగిస్తూ తిరిగి ఉత్తర్వులు వెలువరించింది. ప్రతిభా పురస్కారాల పేరు మారుస్తూ నిన్న జీవో విడుదల కావటంపై ముఖ్యమంత్రి జగన్ ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను సంప్రదించకుండా ఈ జీవోను జారీ చేయటంపై అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. అబ్దుల్ కలాం పేరును తప్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వటం సరికాదని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఆదేశాలతో నిన్నటి జీవోను రద్దు చేసి యథాతథంగా అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలను కొనసాగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు వెలువరించింది.
సంబంధిత కథనం