ETV Bharat / city

National Crime Statistics Report రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, అపహరణలూ ఎక్కువే

National Crime Statistics Report రాష్ట్రంలో వైకాపా హయాంలో దళితులు, గిరిజనులపై నేరాలు గణనీయంగా పెరిగాయి. హత్యలు, అత్యాచారాలు, అపహరణలు అధికమయ్యాయి. మహిళలు, చిన్నారులపై అకృత్యాలు, అత్యంత హింసాత్మక నేర ఘటనలూ ఎక్కువయ్యాయి. ఐపీసీలోని సెక్షన్ల కింద నమోదైన కేసుల్ని పరిగణనలోకి తీసుకుంటే జాతీయ స్థాయి కంటే ఏపీలోనే నేరాల రేటు అధికంగా ఉంది. అత్యధికంగా నేరాలు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ 8వ స్థానంలో ఉంది. గతేడాదిలో దేశంలో జరిగిన మొత్తం నేరాల్లో 3.64 శాతం మన రాష్ట్రంలోనే చోటుచేసుకున్నాయి. 2021లో జరిగిన నేరాలకు సంబంధించి జాతీయ నేర గణాంక సంస్థ ఆదివారం విడుదల చేసిన వార్షిక నివేదిక ఈ వివరాల్ని వెల్లడించింది.

National Crime Statistics Report
జాతీయ నేర గణాంక సంస్థ
author img

By

Published : Aug 29, 2022, 7:22 AM IST

Updated : Aug 29, 2022, 12:17 PM IST

National Crime Statistics Report ఆంధ్రప్రదేశ్‌లో 2020తో పోలిస్తే 2021లో ఎస్సీలపై నేరాలు 3.28 శాతం, ఎస్టీలపై నేరాలు 12.81 శాతం పెరిగాయి. గతేడాది దేశవ్యాప్తంగా ఎస్సీలపై జరిగిన నేరాల్లో 3.95, ఎస్టీలపై చోటుచేసుకున్న నేరాల్లో 4.10 శాతం ఏపీలోనే నమోదయ్యాయి. దళితులు, గిరిజనులపై అత్యధిక నేరాలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ 7వ స్థానంలో ఉంది. 2020లో 8వ స్థానంలో ఉండేది. వారిపై నేరాలు పెరగటంతో ఈ విషయంలో పైకి ఎగబాకింది.

* ఆంధ్రప్రదేశ్‌లో ఎస్టీలపై నేరాల రేటు (13.7 శాతం) జాతీయ స్థాయి (8.4 శాతం) కంటే చాలా ఎక్కువగా ఉంది. దేశంలో ప్రతి లక్ష మంది ఎస్టీ జనాభాకు 8.4 నేరాలు జరుగుతుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 13.7 నేరాలు జరుగుతున్నాయి. ఎస్టీలపై నేరాల రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ అయిదో స్థానంలో ఉంది.

* రాష్ట్రంలో ప్రతి లక్ష మంది ఎస్సీ జనాభాకు 23.8 నేరాలు జరుగుతున్నాయి. ఈ నేరాల రేటూ ఎక్కువే ఉంది.

మహిళల ఆత్మగౌరవానికి భరోసా ఏదీ?: మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ఘటనలు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా గతేడాది ఇలాంటి ఘటనలపై 7,788 కేసులు నమోదవగా.. అందులో 2,370 (30.43%) ఆంధ్రప్రదేశ్‌లోనే చోటుచేసుకోవడం గమనార్హం.

* పని చేసే చోట, ప్రజారవాణాలో ఈ తరహా వేధింపులు అధికంగా జరుగుతున్నాయి. 2020లో ఈ తరహా ఘటనలపై ఏపీలో 2,342 కేసులు నమోదవగా.. గతేడాది ఆ సంఖ్య 2,370కు పెరిగింది.

జాతీయ నేర గణాంక సంస్థ

భారీగా పెరిగిన హత్యలు, అత్యాచారాలు, అపహరణలు..
* ఆంధ్రప్రదేశ్‌లో హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగాయి. 2020లో 853 హత్యలు జరగ్గా.. 2021లో 956 చోటుచేసుకున్నాయి. అంతకు ముందు ఏడాది కంటే ఏకంగా 103 హత్యలు ఎక్కువగా జరిగాయి. హత్యల్లో పెరుగుదల 12.07 శాతం.

* మహిళలపై అత్యాచార ఘటనలూ ఎక్కువయ్యాయి. 2020లో 1095 అత్యాచార ఘటనలు జరగ్గా.. 2021లో 1,188 ఘటనలు చోటుచేసుకున్నాయి. అంతకు ముందు ఏడాది కంటే 93 కేసులు అధికంగా నమోదయ్యాయి. అత్యాచారాలు 8.49 శాతం పెరిగాయి. వీటిలో అత్యధిక శాతం నిందితులు బాధితులకు బాగా పరిచయస్తులే కావడం గమనార్హం.

* కిడ్నాపులూ విపరీతంగా పెరిగాయి. 2020లో 737 ఘటనలు జరగ్గా.. 2021లో 835 ఘటనలు చోటుచేసుకున్నాయి. 98 (13.29%) ఘటనలు అధికంగా నమోదయ్యాయి.

National Crime Statistics Report
జాతీయ నేర గణాంక సంస్థ

మహిళలపై నేరాలూ అధికమే
* రాష్ట్రంలో మహిళలపై నేర ఘటనలు 2020 కంటే 2021లో 3.87 శాతం పెరగడం కలవరపరుస్తోంది. 2020లో 17,089 ఘటనలు చోటుచేసుకోగా.. 2021లో 17,752 కేసులు నమోదయ్యాయి.

* మొత్తంగా చూస్తే వృద్ధులపై నేరాలు కొద్దిగా తగ్గగా.. చిన్నారులపై నేరాలు మాత్రం పెరిగాయి. ఆర్థిక నేరాలు గణనీయంగా పెరిగాయి. సైబర్‌ నేరాలు స్వల్పంగా తగ్గాయి.

పోలీసులే నేరాలకు పాల్పడుతున్న రాష్ట్రాల్లో 5వ స్థానం

పోలీసులే చట్ట ఉల్లంఘనలు, నేరాలకు పాల్పడుతున్న ఘటనలు అత్యధికంగా జరిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో 5వ స్థానంలో నిలిచింది. బిహార్‌ (4,062), మహారాష్ట్ర (448), రాజస్థాన్‌ (245), గుజరాత్‌ (209) కేసులతో తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. 185 కేసులతో ఆంధ్రప్రదేశ్‌ అయిదో స్థానంలో ఉంది. గతేడాది దేశవ్యాప్తంగా పోలీసులపై 6,164 కేసులు నమోదవగా.. వాటిలో 3 శాతం కేసులు ఏపీ పోలీసులపైనే నమోదయ్యాయి. అయితే ఈ నేరాల్లో 61 కేసుల్లోనే అభియోగపత్రం దాఖలు చేశారు. ఒక్కరికీ శిక్ష పడలేదు.

* కస్టడీ (రిమాండులో ఉన్న వ్యక్తుల) మరణాలు అత్యధికంగా జరిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ది మూడో స్థానం. 2021లో మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలో ఆరేసి కస్టడీ మరణాలు చోటుచేసుకోగా.. ఏపీలో 5 జరిగాయి. దేశవ్యాప్తంగా 32 కస్టడీ మరణాలు చోటుచేసుకున్నాయి. దళిత మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ఘటనల్లోనూ ఏపీదే మొదటి స్థానం. దేశవ్యాప్తంగా 150 కేసులు నమోదవగా.. అందులో 83 ఘటనలు ఏపీలోనే జరిగాయి.

National Crime Statistics Report
జాతీయ నేర గణాంక సంస్థ

ఇవీ చదవండి:

Last Updated : Aug 29, 2022, 12:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.