ETV Bharat / city

విద్యుత్తు వాహనం.. పేలుడుకు ప్రధాన కారణాలివే... - Electric vehicle explosion news

ఇటీవల కాలంలో ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌ కొనుగోలు గణనీయంగా పెరిగింది. అయితే బ్యాటరీలు పేలిపోవడం, విద్యుత్తు వాహనాలు తగలబడటంతో కొందరు ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొందరు గాయాల పాలవుతున్నారు. అసలు ఈవీ బ్యాటరీలు ఎందుకు పేలుతున్నాయి? వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు మీ కోసం..

Electric vehicle
Electric vehicle
author img

By

Published : Apr 24, 2022, 4:59 AM IST

పర్యావరణహిత విద్యుత్తు వాహనాల (ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌-ఈవీ) కొనుగోలు ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగింది. చాలామంది వాటివైపు మొగ్గుచూపుతున్నారు. వాటి బ్యాటరీలు పేలిపోవడం, విద్యుత్తు వాహనాలు తగలబడటం వల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఆ మంటల్లో చిక్కుకుపోయి కొందరు ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొందరు గాయాల పాలవుతున్నారు. తాజాగా విజయవాడ ఘటనలో ఒకరు మరణించి, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణలోని నిజామాబాద్‌లోనూ మూడురోజుల కిందట ఇలాంటి ఘటనే జరిగింది. అసలు ఈవీ బ్యాటరీలు ఎందుకు పేలుతున్నాయి? వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

బ్యాటరీల పేలుడుకు ప్రధాన కారణాలివే

* ఈవీల్లోని లిథియం-అయాన్‌ బ్యాటరీల్లో దాదాపు 100-200 వరకూ సెల్స్‌ ఉంటాయి. వాటిని బ్యాటరీలో ప్యాక్‌చేసే విధానంలో తేడాలుంటే అవి పేలిపోయే అవకాశం ఉంటుంది.

* బ్యాటరీ లోపల షార్ట్‌సర్క్యూట్‌ జరగడం కూడా పేలుడుకు కారణమవుతోంది.

* బ్యాటరీల్లో నాసిరకం సెల్స్‌ ఉండటం, బ్యాటరీ డిజైన్‌లో లోపాలు

* ఛార్జింగ్‌ అవుతున్నప్పుడు నియంత్రణ లేని విద్యుత్తు బ్యాటరీకి అందటం

* వైరింగ్‌లో తప్పిదాలు, ఫ్యూయల్‌ లైన్‌లో తేడాలు

* నిర్దేశిత సమయానికి మించి ఛార్జింగ్‌ చేయడం. రాత్రంతా ఛార్జింగ్‌ పెట్టి వదిలేయడం

* వాహనాన్ని కడిగిన వెంటనే ఛార్జింగ్‌ చేస్తే అందులో సాకెట్‌ దెబ్బతింటుంది.

* బ్యాటరీ పేలిపోయే ముందు బాగా వేడెక్కుతుంది. తర్వాత పొగలు, మంటలు వస్తాయి.

* సగటు సమయాన్ని మించి ఛార్జింగ్‌ చేయొద్దు. వేడెక్కినట్లు భావిస్తే ఛార్జింగ్‌ ఆపేయాలి. కొన్నిసార్లు విద్యుత్‌ సరఫరాలో హెచ్చుతగ్గులు బ్యాటరీని వేడెక్కిస్తాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలివి..

* ఈవీలను మరీ ఎక్కువ ఎండలోనూ, మరీ చల్లని వాతావరణంలోనూ ఎక్కువ సమయం నిలిపి ఉంచొద్దు

* ఛార్జింగ్‌ పెట్టేందుకు ఒరిజినల్‌, అధీకృత ఛార్జర్లనే వినియోగించాలి.

* బ్యాటరీలను మండే స్వభావం కలిగిన వస్తువులకు దూరంగా ఉంచాలి.

* గది ఉష్ణోగ్రత వద్ద బ్యాటరీలను ఉంచాలి.

* బ్యాటరీ కేసింగ్‌ దెబ్బతిన్నా, అందులోకి నీరు చేరినా వెంటనే దాన్ని పక్కన పెట్టి.. డీలరుకు సమాచారమివ్వాలి.

* బ్యాటరీ, ఛార్జర్‌ను పరిశుభ్రమైన, పొడిగా ఉన్న, బాగా వెలుతురు వచ్చేచోట ఉంచాలి.

* లిథియం అయాన్‌ బ్యాటరీలు ఛార్జింగ్‌ చేసేటప్పుడు బాగా వేడెక్కుతాయి. దాన్ని తరచూ పరిశీలించుకోవాలి.

* బ్యాటరీని ఎప్పుడూ 100% ఛార్జింగ్‌ చేయకూడదు. పూర్తిగా వదిలేయకూడదు. 20-80 శాతం మధ్య ఛార్జింగ్‌ ఉండేలా చూసుకోవాలి.

ఇలా చేయొద్దు

* బ్యాటరీలను రాత్రంతా ఛార్జింగ్‌ పెట్టి వదిలేయొద్దు.

* సూర్యకాంతి నేరుగా తగిలే చోట బ్యాటరీలను ఉంచొద్దు

* వాహనాన్ని వినియోగించిన తర్వాత దాదాపు గంట వరకూ బ్యాటరీకి ఛార్జింగ్‌ పెట్టొద్దు.

* వేగంగా ఛార్జింగ్‌ చేయొద్దు. దానివల్ల తక్కువ సమయంలో ఎక్కువ విద్యుత్తు బ్యాటరీలోకి చేరి దానిపై ఒత్తిడి పడుతుంది.

ఇలాంటి వ్యవస్థలు అవసరం

* ఈవీల్లో స్మార్ట్‌ బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌, థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఉంటే ఇలాంటి ప్రమాదాల్ని కొంత నియంత్రించొచ్చు.

* స్మార్ట్‌ బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా బ్యాటరీతో పాటు, అందులోని ప్రతి సెల్‌ ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

* ఉష్ణోగ్రతలు గరిష్ఠస్థాయికి చేరితే థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ లేదా యాక్టివ్‌ కూలింగ్‌ సిస్టమ్‌ పనిచేస్తాయి. బ్యాటరీ ప్యాక్‌ చుట్టూ ఉండే ఫ్యాన్లు తిరిగి ఉష్ణోగ్రతల్ని తగ్గిస్తాయి.

బ్యాటరీ కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

* ఈవీల్లో అత్యంత ప్రధానమైన విభాగం బ్యాటరీయే. దీన్ని అధీకృత డీలర్ల వద్ద మాత్రమే కొనాలి

* ఈవీ, బ్యాటరీ తయారీ సంస్థలకు కచ్చితంగా ఏఆర్‌ఏఐ (ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా) అనుమతి ఉండాలి. ఆ సంస్థ నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఉత్పత్తి చేసిన బ్యాటరీలు కొనాలి.

* తక్కువ ధరకు లభిస్తాయని కొన్ని చైనా కంపెనీలు విక్రయించే నాణ్యతలేని బ్యాటరీలు కొనుగోలు చేయొద్దు.

* బ్యాటరీ తయారీకి కేంద్ర ప్రభుత్వం ఏఐఎస్‌ 156 పేరిట కొత్త ప్రమాణం తీసుకొచ్చింది. దీని ప్రకారం వాహనాన్ని షార్ట్‌ సర్క్యూట్‌, ఓవర్‌ ఛార్జింగ్‌, భిన్నవాతావరణ పరిస్థితులు, నీటిలో తడపడం సహా అనేక రూపాల్లో పరీక్షిస్తారు. ఏఐఎస్‌ 156 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న బ్యాటరీలనే కొనాలి.

ఇదీ చదవండి: విజయవాడలో ఎలక్ట్రికల్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.