రాష్ట్రంలో రసాయన పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది. ఈ నెల 20న సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈ కమిటీ నివేదికను ఇవ్వనుంది.ఇప్పటికే విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై హై పవర్ కమిటీ విచారణ చేస్తోంది.
పరిశ్రమ అసలు నియమాలు పాటించిందా లేదా, ప్రమాద నివారణకు ఎలాంటి వ్యవస్థ ఉంది? ప్రమాదానికి కారణమైన గ్యాస్ వల్ల భవిష్యత్లో ఏదయినా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా అనే అంశాలను లోతుగా అధ్యయనం చేస్తున్నారు. మరోసారి రసాయన పరిశ్రమలో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాలిసిన విధానాలు రూపొందించనున్నారు.
ఇవీ చదవండి