ETV Bharat / city

HIGH COURT: ఆ కేెంద్రాలకు వైకాపా రంగులెలా వేస్తారు? - ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

చెత్త, వ్యర్థాల నుంచి సంపద సృష్టించే కేంద్రాలకు వైకాపా జెండా రంగులు వేయడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా పార్టీ రంగులు ఏ విధంగా వేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈనెల 16న పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

High Court
High Court
author img

By

Published : Sep 9, 2021, 4:00 AM IST

చెత్త, వ్యర్థాల నుంచి సంపద సృష్టించే కేంద్రాలకు వైకాపా జెండా రంగులు వేయడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా పార్టీ రంగులు ఏ విధంగా వేస్తారని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈనెల 16న పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రతివాదులుగా ఉన్న పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, గుంటూరు జిల్లా కలెక్టర్, స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ ఎండి తదితరులకు నోటీసులు జారీచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జయసూర్యతో కూడిన దర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం, కృష్ణా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ... తడి, పొడి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు వైకాపా జెండా రంగులు వేయడాన్ని ప్రశ్నిస్తూ జై భీమ్ యాక్సెస్ జస్టిస్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు సురేశ్ కుమార్ హైకోర్టులో పిల్ వేశారు. న్యాయవాది శ్రావన్ కుమార్ వాదనలు వినిపిస్తూ గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తూ వైకాపా రంగులేస్తున్నారన్నారు. విద్యుత్ మోటార్లు, గోడలు, మరుగుదొడ్లను వదలకుండా వైకాపా రంగులే వేశారన్నారు. ఈ కేంద్రాలన్ని పంచాయతీ నిధులతో నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఏజీ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తడిచెత్తకు గుర్తుగా పచ్చరంగు, పొడి చెత్తను గుర్తుగా నీలం రంగు వేస్తున్నామన్నారు. తెలుపు రంగు కూడా కలిసి ఉండటంతో అధికారపార్టీ జెండా రంగుగా పోలినట్లు ఉందన్నారు. ఆ వివరాలపై సంతృప్తి చెందని ధర్మాసనం అధికారుల హాజరుకు ఆదేశించింది.

ఇదీ చదవండి

వినాయక చవితికి సెలవు ప్రకటించిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.