ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా నిత్యావసర సరకులను (రేషన్) లబ్ధిదారుల ఇళ్ల దగ్గరే అందించే ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలను రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (ఏపీఐడీసీ)కు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాలకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా నిత్యావసరాల పంపిణీకి 9,260 వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది.
యూనిట్ వ్యయంలో 60 శాతం ప్రభుత్వం రాయితీగా అందిస్తుంది. మిగిలిన మొత్తంలో 30 శాతం బ్యాంకు రుణం, 10 శాతాన్ని లబ్ధిదారుడి వాటా కింద సమకూర్చాలి. ఈ తరహా స్వయం ఉపాధి పథకాలను ఇక మీదట ఏపీఐడీసీ పర్యవేక్షిస్తుంది. ఇందుకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చదవండి: