ETV Bharat / city

రోజుకో కొత్త సవాళ్లు విసురుతోన్న కరోనా మహమ్మారి

author img

By

Published : Apr 18, 2020, 8:22 AM IST

కరోనా వైరస్‌ రోజురోజుకీ కొత్త సవాళ్లను విసురుతోంది. వ్యాధి లక్షణాలు బయటపడకుండా మనుషులను గుప్త వాహకులుగా మార్చుకుంటుంది కొవిడ్​ మహమ్మారి. వ్యాధి లక్షణాలు బయటపడితే బాధితుడే వైద్య పరీక్షలకు వెళతాడు. మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకొంటాడు. అయితే లక్షణాలు కనిపించని కొందరిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తేగానీ వ్యాధి సోకిన ఆనవాళ్లు బయటపడట్లేదు. ఇటువంటి వారిని రోజుల తరబడి క్వారంటైన్‌లో ఉంచినా ఎటువంటి లక్షణాలు బయటపడలేదు.

GUPTHA VAHAKAM
GUPTHA VAHAKAM

కరోనా వైరస్‌ రోజురోజుకీ కొత్త సవాళ్లను విసురుతోంది. వ్యాధి లక్షణాలు బయటపడితే బాధితుడే వైద్య పరీక్షలకు వెళతాడు. మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకొంటాడు. అయితే లక్షణాలు కనిపించని కొందరిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తేగానీ వ్యాధి సోకిన ఆనవాళ్లు బయటపడట్లేదు. ఇటువంటి వారిని రోజుల తరబడి క్వారంటైన్‌లో ఉంచినా ఎటువంటి లక్షణాలు బయటపడలేదు. వీరిని ఏసిమ్టమాటిక్‌ (గుప్త వాహకులు)గా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి వారి నుంచి వ్యాధి వేగంగా వ్యాపించే ప్రమాదం పొంచిఉంది. ఇటువంటి కేసులను కనిపెట్టి చికిత్స చేయడం పెనుసవాలుగా మారింది.

నాలుగింట ఒకరు..

చైనాలో మహమ్మారి ప్రబలినప్పటి నుంచి రోగ లక్షణాలు బయటపడిన వారినే ఆ దేశం లెక్కల్లో చూపింది. అప్పటికే అమెరికా సీడీసీ నాలుగింట ఒకరు గుప్త వాహకులుగా మారుతున్నట్లు పేర్కొంది. ఏప్రిల్‌ 1 నుంచి చైనా కూడా వీరిని లెక్కల్లో ప్రత్యేకంగా చూపించడం మొదలుపెట్టింది. తొలిరోజే మొత్తం 166 కేసుల్లో 130 మందిని గుప్తవాహకులుగా తేల్చింది. ఏప్రిల్‌ 8 నాటికి అక్కడ వీరి సంఖ్య 1,104ను దాటింది. బుధవారం చైనా నేషనల్‌ హెల్త్ కమిషన్‌ విడుదల చేసిన లెక్కల ప్రకారం జనవరి 28 నుంచి 6,700 గుప్త వాహక కేసులు నమోదైనట్లు పేర్కొంది. వీరిలో 1,297 మందిలో కొన్నాళ్ల తర్వాత రోగలక్షణాలు బయటపడగా.. మరో 4,444 మంది 28 రోజులు క్వారంటైన్‌ పూర్తి చేసినా సాధారణంగానే కనిపిస్తున్నారని పేర్కొంది. మరో వెయ్యి మందిని పరిశీలనలో ఉంచినట్లు తెలిపింది.

ఆందోళనకు గురిచేస్తున్న రెండో తరంగం..!

కరోనా తొలుత గుర్తించిన వుహాన్‌ మినహా హుబే ప్రావిన్స్‌లో లాక్‌డౌన్‌ను మార్చి 25న తొలగించారు. దీంతో ప్రజలు భారీ సంఖ్యలో బయట ప్రదేశాలకు వెళ్లారు. ఏప్రిల్‌ 1 నుంచి ఆ ప్రావిన్స్‌లో నిర్వహించిన పరీక్షల్లో 429 మంది గుప్తవాహకులను గుర్తించారు. బయట ప్రదేశాలకు వెళ్లిపోయిన వారిలో గుప్తవాహకులు ఉంటే మరోసారి కరోనా విజృంభించే ప్రమాదం పొంచింది. ఇప్పుడు ఈ రెండో తరంగం భయపెడుతోంది. చైనా వంటి జనసాంద్రత ఉన్న ప్రదేశాల్లో కరోనా వ్యాప్తిరేటు ఎక్కువగా ఉంటుంది.

ప్రాణాంతకమైంది ఎందుకంటే..?

ఫ్లూ సోకిన ఐదు రోజుల్లోపే లక్షణాలు బయటపడిపోతాయి. ఈ క్రమంలో ఆ వ్యక్తి అప్రమత్తమై చికిత్స తీసుకొంటాడు. దీనికి తోడు వ్యాక్సిన్‌ తీసుకొన్నవారిని, వ్యాధి నిరోధక శక్తి ఉన్న వారిని ఇది ఏమీ చేయలేదు. ఈ రెండు లేనివారికి మాత్రమే సోకుతుంది. అందుకే దీని వ్యాప్తిరేటు(ఆర్‌నాట్‌) 1.3గా ఉంది. కానీ, కొవిడ్‌లో 14 రోజుల పాటు లక్షణాలు బయటపడకుండా ఉండేందుకు అవకాశం ఉంది. దీని వ్యాప్తిరేటు 2-2.5గా ఉంది. ఈ నేపథ్యంలో ఆ రెండు వారాలపాటు వ్యాధిగ్రస్తుడు పలువురికి దీన్ని అంటిస్తాడు. పైగా కొవిడ్‌కు ఎటువంటి వ్యాక్సిన్‌ లేకపోవడం, ప్రజల్లో రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందకపోవడం వల్ల రోగి పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరికి సోకే ప్రమాదం ఉంది.

సాధారణ ఫ్లూ వ్యాప్తిరేటు 1.3 అనుకుంటే. పది దశలు దాటాక అది 56 మందికి సోకే అవకాశం ఉంది. అదే కొవిడ్‌-19 వ్యాప్తిరేటు కనిష్టంగా 2 అనుకుంటే పది దశలు దాటాకా 2047 మంది ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది’’

వీరు గుప్త వాహకులు

* ఫిబ్రవరి నెలలో డైమండ్‌ ప్రిన్సెస్‌ క్రూజ్‌ నౌకలో గుర్తించిన 712 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల్లో సగం మందిలో ఎటువంటి రోగ లక్షణాల్లేవు.

* ఇటలీలోని ‘యూనివర్శిటీ ఆఫ్‌ ఫ్లోరెన్స్‌’ ఇమ్యునాలజీ ప్రొఫెసర్‌ సెర్గియో రొమగ్నాని నేతృత్వంలో వెనిస్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామంలో నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో 3000 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ గ్రామాన్ని క్వారంటైన్‌ చేశారు. పరీక్షల సమయంలో వీరిలో సగం మందికిపైగా ఎటువంటి లక్షణాలు కనిపించలేదు.

* అమెరికా సీడీసీ వాషింగ్టన్‌లోని కింగ్స్‌కౌంటీలో కొవిడ్‌ సోకిన 23 మందిని పరీక్షించగా.. వీరిలో కేవలం 10 మందిలో మాత్రమే వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. మిగిలిన వారు సాధారణ స్థితిలోనే ఉన్నారు. దుబాయ్‌ నుంచి కేరళలోని కన్నూర్‌కు వచ్చిన వ్యక్తి 28 రోజులు ఐసొలేషన్‌లో ఉన్నాడు. ఆ తర్వాత పరీక్షిస్తే పాజిటివ్‌గా తేలింది. అయినా లక్షణాలు బయటపడలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.