ETV Bharat / city

25 శాతం కళాశాలలకు బోధనా రుసుములు ఇవ్వక్కర్లేదు..!

కళాశాలల వారీగా బోధన రుసుములను నిర్ణయించి... ఫిబ్రవరిలో ప్రభుత్వానికి ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ నివేదిక అందజేయనుంది. కళాశాలలను నాలుగు కేటగిరీలుగా విభజించి... సీ కేటగిరీ కళాశాలల మూసివేతకు సూచన చేయనున్నారు.

the-andhra-pradesh-higher-education-regulatory-and-supervisory-commission
25శాతం కళాశాలలకు బోధనా రుసుములు ఇవ్వక్కర్లేదు!
author img

By

Published : Dec 29, 2019, 5:54 AM IST

రాష్ట్రంలోని వృత్తి విద్యా కళాశాలలకు మొదటిసారిగా కన్వీనర్, యాజమాన్య కేటగిరీలుగా బోధనా రుసుములను నిర్ణయించనున్నారు. వైద్య విద్యలో అనుసరిస్తున్న విధానాన్నే ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులకు అమలు చేయాలని ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు ఒక నివేదికను రూపొందించి.. ఫిబ్రవరిలో ప్రభుత్వానికి సమర్పించనుంది.

కమిషన్ ప్రస్తావించిన అంశాలు...

  • అండర్ గ్రాడ్యుయేషన్​లో 25 శాతం కళాశాలలు నిర్ణీత ప్రమాణాలను పాటించనందున వీటికి రుసుముల నిర్ణయ అర్హత లేదు.
  • కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, ఇతరత్రా నిబంధనల ఆధారంగా పాయింట్లు కేటాయించాలి. ఈ పాయింట్ల వారీగా రుసుములు చెల్లించాలి.
  • కళాశాలలను నాలుగు కేటగిరీలుగా విభజించి.. ఇందులో 'సీ' కేటగిరీ వాటికి రుసుములను నిర్ణయించకుండా మూసేసుకోవాలని యాజమాన్యాలకు సూచించాలి.
  • ప్రతి కళాశాలలో బయోమెట్రిక్​ హాజరు తప్పనిసరి చేయటం సహా 75 శాతం హాజరు ఉంటేనే బోధన రుసుములు చెల్లించేలా నిబంధనలు తీసుకురావాల్సి ఉంది.
  • ఎంసెట్, నీట్ అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే బోధన రుసుములకు అర్హులుగా నిర్ణయించాలి.
  • బీఈడీ, ఎంఈడీ, నర్సింగ్​లో అర్హత లేని విద్యార్థులకు ప్రవేశాలు కల్పించటంతో పాటు తరగతుల నిర్వహణ లేకుండానే కొన్ని కళాశాలలు బోధన రుసుములను పొందుతున్నట్లు కమిషన్ వెల్లడించింది.

రుసుముల నిర్ణయం ఇలా...

  • విద్యార్థిపై కళాశాల చేస్తున్న వ్యయాన్నే రుసుములకు ప్రామాణికంగా తీసుకోనున్నారు.
  • మౌలిక సదుపాయాలు, పరిశోధన, అక్రిడిటేషన్, ప్రాంగణ నియామకాలు, బోధనార్హతలు, విద్యార్థి...అధ్యాపక నిష్పత్తి, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా 500 పాయింట్లను కేటాయిస్తారు. వాటి ఆధారంగా రుసుములు నిర్ణయిస్తారు.
  • కళాశాలలను ఏ+, ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజిస్తారు. ఏ+, ఏ, బీ కేటగిరీ కళాశాలలకు రుసుములు నిర్ణయిస్తారు.
  • సీ కేటగిరీ కళాశాలలకు రుసుములు నిర్ణయించకపోవచ్చు. వాటిలో చదువుతున్న విద్యార్థుల బోధన పూర్తయ్యే వరకు కొనసాగించడమా... సమీపంలోని మరో కళాశాలలో సర్దుబాటు చేయడమా అనేది నిర్ణయిస్తారు.

ఇదీ కళాశాలల పరిస్థితి...

2016 - 17 నుంచి 2018 - 19 వరకు ప్రవేశాలు, రుసుముల విషయంలో ప్రమాణాలు పాటించని కళాశాలలకు రూ.721 కోట్లు చెల్లిస్తున్నట్లు కమిషన్ పేర్కొంది. 25శాతం యూజీ కళాశాలలకు బోధన రుసుములు పొందేందుకు అర్హత లేదని వెల్లడించింది. 75 శాతం ఎంటెక్, ఎం.ఫార్మా కళాశాలలు విద్యార్థులు హాజరు లేకుండానే కొనసాగుతున్నాయని... వీటికి రుసుముల నిర్ణయ అర్హత లేదని వెల్లడించింది. వీటిల్లో అధ్యాపకులు, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలని సూచించింది.

ఇవీ చూడండి:

విద్య, వైద్య రంగాలకే ప్రభుత్వ ప్రాధాన్యత: సీఎస్​

Intro:Body:

eenadu

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.