ఈ పోటీ ప్రపంచంలో గెలవడమే కాదు.. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడమూ ముఖ్యమే. టాప్‌లో ఉన్న వాళ్లు ఏమాత్రం తడబడినా కింద ఉన్న వాళ్లు ఆ స్థానాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్న కాలమిది. ప్రస్తుతం మెసేజింగ్ యాప్స్ వాట్సాప్, టెలిగ్రామ్( Telegram )లను చూస్తే ఈ విషయం తెలుస్తుంది. వాట్సాప్ తప్పిదాలు ప్రత్యర్థి టెలిగ్రామ్‌కు బాగా కలిసొస్తున్నాయి. ఒకేసారి వాట్సాప్ సేవలు ఏడు గంటల పాటు నిలిచిపోవడంతో టెలిగ్రామ్ మరోసారి పండగ చేసుకుంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 7 కోట్ల మంది కొత్త యూజర్లను టెలిగ్రామ్ సంపాదించుకుంది. ఫేస్బుక్, వాట్సాప్ సేవల్లో అంతరాయం సమయంలో తమకు కొత్తగా 7 కోట్ల మంది యూజర్లు వచ్చినట్లు టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ చెప్పారు. టెలిగ్రామ్‌కు ఇప్పటి వరకు 100 కోట్లకుపైగా డౌన్‌లోడ్‌లు ఉన్నాయి. అందులో 50 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు.
ఇదీ చదవండి