అమరావతి కోసం రాజధాని మహిళలు చేసే ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు జోష్న చెప్పారు. రాజధాని పర్యటనలో భాగంగా కృష్ణాయ పాలెంలో దీక్షా చేస్తున్న మహిళలకు తెలంగాణ తెదేపా నేతలు మద్దతు తెలిపారు. మహిళలతో కలిసి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాజధాని ఐకాస పిలుపు మేరకు మేము ఎలాంటి సహకారమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని జోష్నా చెప్పారు. కృష్ణాయ పాలెం వచ్చిన తెలంగాణ తెదేపా మహిళా నేతలకు స్థానిక మహిళలు ఆకుపచ్చ కండువాలతో సత్కరించారు.
ఇదీ చదవండి:
విస్తరిస్తున్న సొంతింటి పంట సంస్కృతి.. 2.5 లక్షల ఇళ్లలో మిద్దె పంటల పెంపకం