ETV Bharat / city

Bharat Biotech: భారత్​ బయోటెక్​ సంస్థకు నా అభినందనలు: గవర్నర్​ - Bharat Biotech

Bharat Biotech: కొవిడ్‌ నివారణ కోసం నాజల్‌ డ్రాప్స్‌ను తీసుకువచ్చే పనిలో ముందుకెళ్తున్నందుకు భారత్​ బయోటెక్​ను అభినందిస్తున్నానని తెలంగాణ గవర్నర్​ తమిళిసై తెలిపారు. కొవిడ్ టీకాల ఉత్పత్తి, తయారీలోనూ దేశం అత్యంత విజయవంతమైందని ప్రశంసించారు.

governor praises bharat biotech
భారత్​ బయోటెక్​ను అభినందిస్తున్నా..: గవర్నర్​
author img

By

Published : Feb 25, 2022, 10:55 PM IST

భారత్​ బయోటెక్​ను అభినందిస్తున్నా..: గవర్నర్​

Bharat Biotech: భారత్​ బయోటెక్​ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ అభినందించారు. కొవిడ్​ నివారణ కోసం నాజల్​ డ్రాప్స్​ను తీసుకొస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్​లోని దుర్గాబాయ్​ దేశ్​ముఖ్​ ఆసుపత్రిలో డీ.ఈ.షా (D.E SHAW) కంపెనీ విరాళంగా అందించిన ఆక్సిజన్​ ప్లాంట్​ను గవర్నర్​ ప్రారంభించారు. పేదలకు నిస్వార్థంగా సేవలు అందిస్తోన్న దుర్గాబాయ్ దేశ్​ముఖ్​ ఆసుపత్రికి అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా డీ.ఈ.షా కంపెనీని అభినందించారు.

కొవిడ్ రెండో వేవ్ సమయంలో మెడికల్ ఆక్సిజన్ కొరతను ఎదుర్కొన్న దేశం.. ప్రస్తుతం స్వయం సమృద్ధి సాధించిందన్నారు. మోదీ నేతృత్వంలో ఆక్సిజన్ ఉత్పత్తి రెట్టింపైందని గవర్నర్ అన్నారు. కొవిడ్ టీకాల ఉత్పత్తి, తయారీలోనూ దేశం అత్యంత విజయవంతమైందని ప్రశంసించారు.

150 కోట్లకుపైగా కొవిడ్‌ టీకా డోసులను దేశ ప్రజలకు ఇచ్చాం. 100కు పైగా దేశాలకు వ్యాక్సిన్లను ఎగుమతి చేశాం. ఇదంతా చిత్తశుద్ధితో పని చేస్తున్న వైద్య సిబ్బంది, శాస్త్రవేత్తల వల్లే సాధ్యమయ్యింది. అలాగే మన రాష్ట్రంలోనే ఉన్న భారత్‌ బయోటెక్‌.. కొవిడ్‌ నాజల్‌ డ్రాప్స్‌ను తీసుకువచ్చే పనిలో ముందుకెళ్తున్నందుకు అభినందిస్తున్నా. పోలియోను ఏ రకంగా పోలియో చుక్కలతో నివారించామో.. అలాగే కొవిడ్‌ను చుక్కల టీకాతో అరికట్టవచ్చు.- తమిళిసై సౌందరరాజన్, తెలంగాణ గవర్నర్

ఇదీచూడండి: మిలన్-2022 ప్రారంభం.. విశాఖ నౌకాశ్రయానికి చేరిన పలు దేశాల నౌకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.