ETV Bharat / city

వారికి తరగతులు కొనసాగించాలా..? వద్దా..?

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలు కొనసాగింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. పాఠశాలలు, గురుకులాల్లో కొవిడ్​ బారిన విద్యార్థులు పడుతున్న దృష్ట్యా రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సభాముఖంగా సీఎం కేసీఆర్​ ప్రకటించారు.

telangana government schools
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలపై కరోనా ప్రభావం
author img

By

Published : Mar 18, 2021, 10:33 AM IST

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు, గురుకులాల్లో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో 6, 7, 8 తరగతుల వరకైనా ప్రత్యక్ష తరగతులను నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పాఠశాలలను కొనసాగించాలా? లేదా? అనే అంశంపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం అసెంబ్లీలో ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు బుధవారం సాయంత్రం తరగతులు, జిల్లాలవారీగా విద్యార్థుల సంఖ్య, ఇప్పటివరకు కరోనా బారిన పడిన విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, మూతపడిన బడుల వివరాలను అధికారుల నుంచి హడావుడిగా తెప్పించుకున్నారు. మొత్తం 200 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ బారినపడ్డారని ప్రభుత్వానికి నివేదించారు. ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉండటం, వారి ద్వారా కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో కనీసం 6, 7, 8 తరగతులను అయినా నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఆ మూడు తరగతుల్లో 14.34 లక్షల మంది విద్యార్థులున్నారు.

హాజరు 48 శాతమే..

6, 7, 8 తరగతులకు ఫిబ్రవరి 24 నుంచి ప్రత్యక్ష బోధనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా వారం వరకు 30 శాతానికి హాజరు మించలేదు. ప్రస్తుతం సగటు హాజరు 48 శాతానికి చేరింది. అదే 9, 10 తరగతుల హాజరు 78 శాతం ఉంది. ఆ రెండు తరగతులకైతే క్లాసుల కొరత ఉండదని, భౌతిక దూరం పాటించడం వీలవుతుందని ప్రధానోపాధ్యాయులు కొందరు తెలిపారు. తొమ్మిదో తరగతికీ ప్రత్యక్ష బోధన నిలిపివేయవచ్చని, కాకపోతే 10వ తరగతికి పునాది 9వ తరగతి అయినందున ఆ తరగతి విద్యార్థులను అనుమతించాలని సూచిస్తున్నారు. ఈ రెండు తరగతుల్లో మొత్తం 9.46 లక్షల మంది విద్యార్థులున్నారు. ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌ మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలే కరోనా వ్యాప్తికి కారణమని చెబుతున్నారు.

ఇవీ చూడండి:

ఏపీ హైకోర్టులో 18 జడ్జిల పోస్టులు ఖాళీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.