తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీలో తండ్రి, కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. గోసంగి కాలానీకి చెందిన అక్బర్ గతంలో రోడ్లపై మహిళలకు సంబంధించిన రబ్బర్ బ్యాండ్, పిన్నీసులు అమ్ముకునేవాడు. 5 ఏళ్ల క్రితం తండ్రి కుమార్తెను వదిలి తల్లి ఇంట్లోంచి వెళ్లిపోయింది.
కరోనా కారణంగా కొద్ది కాలంగా పని లేక అక్బర్ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. కాలనీలోని గుడిసెలో తండ్రి కుమార్తె ఇద్దరేే ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్నిఅతలాకుతలం చేశాయి. దీంతో 14 సంవత్సరాల కుమార్తె సైరా బేగంకు శీతలపానియంలో పురుగుల మందు కలిపి తాగించాడు తండ్రి అక్బర్. తర్వాత అదే ఇంట్లో తనూ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనా స్థలాన్ని కామారెడ్డి రూరల్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, దేవునిపల్లి ఎస్సై శ్రీకాంత్ పరిశీలించారు.
ఇదీ చదవండి: 'రాజధాని అంశం పక్కన పెట్టి.. కరోనాపై దృషి పెట్టండి'