ETV Bharat / city

మొండిగా ఉంటేనే.. మహమ్మారిని ఎదుర్కోగలం: కేసీఆర్ - cm kcr visited covid ward in mgm hospital

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్​ నగరంలో పర్యటిస్తున్నారు. ముందుగా ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన ఆయన.. కరోనా రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. కొవిడ్ వార్డులో సందర్శించి.. రోగులతో మాట్లాడారు. వారిలో ఉత్సాహం నింపి.. మనోధైర్యాన్ని అందించారు.

cm kcr
cm kcr
author img

By

Published : May 21, 2021, 3:45 PM IST

వరంగల్ పర్యటనలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 12.45 గంటలకు ఎంజీఎం దవాఖానకు చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​... నేరుగా కొవిడ్ బాధితులు ఉన్న ఐసీయూ వార్డులోకి వెళ్లి పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. కరోనాకు భయపడవద్దంటూ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వరంగల్ మట్టెవాడకు చెందిన కరోనా బాధితుడు వెంకటాచారి తనకు చికిత్స బాగానే అందుతుందని సీఎంకు వివరించారు. కేసీఆర్ జిందాబాద్.. కేసీఆరే నా నిండు ప్రాణం అని ఆయన అన్నారు.

అనంతరం జనరల్ వార్డును సీఎం కేసీఆర్ సందర్శించి రోగులను పరామర్శించారు. ఎంజీఎం ఆస్పత్రి అంతా కలియతిరిగి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఉన్న వైద్య సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎంత ఖర్చయినా సరే.. రోగులకు కావాలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, సీఎస్ సోమేశ్ కుమార్, రిజ్వి, డీఎం ఈ.రమేశ్​ రెడ్డి, ఓఎస్​డీ గంగాధర్, టీఎస్​ఎంఎస్​ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్​ చంద్ర శేఖర్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, సీపీ తరుణ్ జోషి, జిల్లాకు చెందిన పలువురు నాయకులున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.