ETV Bharat / city

తెలంగాణ: కరోనా నుంచి కోలుకున్న 210 మంది - Telangana: 210 people recovered from Corona

కరోనా సోకి తెలంగాణలోని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 210 మంది బాధితులు ఇవాళ డిశ్చార్డ్ అయ్యారు. వైద్యులు తమను కంటికి రెప్పలా చూసుకున్నారని వారు తెలిపారు.

Telangana: 210 people recovered from Corona
తెలంగాణ: కరోనా నుంచి కోలుకున్న 210 మంది
author img

By

Published : Aug 11, 2020, 9:51 PM IST

కొవిడ్ బారిన పడి తెలంగాణలోని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గత 15 రోజులుగా చికిత్స పొందుతున్న 210 మంది కరోనా బాధితులు మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. ప్రాణాలు పోతాయనే భయంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన తమను వైద్యులు కంటికి రెప్పలా చూసుకున్నారని వారు పేర్కొన్నారు. వైద్యులు తమకు ధైర్యం చెప్తూ ప్రతిరోజు వైద్యాన్ని అందించినట్లు తెలిపారు, మంచి పౌష్టికాహారని ఆహారాన్ని అందించారన్నారు.

కరోనా నుంచి కోలుకున్న బాధితులను వైద్యులు చప్పట్లతో తమ ఇళ్లకు సాగనంపారు. వారికి నయం కావడంలో కీలక పాత్ర వహించిన వైద్యులకు ఆసుపత్రి సూపరింటెండెంట్​ ప్రతిమ రాజ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్, శానిటేషన్ సేవలు బాగున్నాయని కరోనా నుంచి కోలుకున్న పలువురు కొనియాడారు.

ఇవీ చూడండి:

భూములకు భద్రత... ప్రాణాలకు రక్షణ ఏది: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.