ETV Bharat / city

Teachers గురు పూజోత్సవాన్ని బహిష్కరిస్తున్నాం: ఏపీ ఉపాధ్యాయులు - రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు

Teachers boycott Guru Pujotsavam గురు పూజోత్సవాన్ని బహిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులకు నోటీసులు అందజేశాయి. సోమవారం కార్యక్రమాలకు హాజరు కావద్దని ఇప్పటికే కొన్ని సంఘాలు నిర్ణయించాయి. మరికొన్ని సంఘాలూ ఇదే బాటలో నడుస్తున్నాయి.

teachers
టీచర్స్​
author img

By

Published : Sep 5, 2022, 9:32 AM IST

Unions to boycott Teacher’s Day: గురు పూజోత్సవాన్ని బహిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులకు నోటీసులు అందజేశాయి. సోమవారం కార్యక్రమాలకు హాజరు కావద్దని ఇప్పటికే కొన్ని సంఘాలు నిర్ణయించాయి. మరికొన్ని సంఘాలూ ఇదే బాటలో నడుస్తున్నాయి.

నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలి
గురు పూజోత్సవాన్ని బహిష్కరిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలి. ఎంఈవో కార్యాలయాల ఎదుట సాయంత్రం నిరసనలు తెలపాలి.

- డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు నరహరి, ప్రధాన కార్యదర్శి రమణ

కేసులను ఉపసంహరించాలి

ఉపాధ్యాయులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించాలి. సమస్యల పరిష్కారానికి నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. ఈ కేసులను వెంటనే ఉపసంహరించాలి.

- రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు

ప్రభుత్వానిది నిరంకుశ విధానం

ఉపాధ్యాయులపై కేసులను వ్యతిరేకిస్తున్నాం. పాఠశాలల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించకుండా పలు రకాల యాప్‌లతో బోధన సమయాన్ని ప్రభుత్వం వృథా చేస్తోంది. పురపాలక విద్యా వ్యవస్థలను పాఠశాల విద్యాశాఖ నిర్లక్ష్యం చేస్తోంది.

- ఏపీఎంటీఎఫ్‌ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి రవి సిద్దార్థ

సీపీఎస్‌ ఉద్యోగులు వేడుకలకు దూరం

ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నాం. ఈ వేడుకలకు సీపీఎస్‌ ఉపాధ్యాయులు దూరంగా ఉండాలి. వేలమంది సిబ్బందిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టించింది.

- ఏపీసీపీఎస్‌యూఎస్‌ అధ్యక్షుడు అమరదాసు, ప్రధాన కార్యదర్శి రవికుమార్‌

అనుమతి ఇవ్వకపోగా.. పోలీసు కేసులా?

ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నాం. పోలీసులు అక్రమంగా కేసులు బనాయించి, స్టేషన్ల చుట్టూ తిప్పారు. ఇప్పటికీ 41 రకాల కేసులతో ఉద్యోగులను వేధిస్తూనే ఉన్నారు.

- ఏపీసీపీఎస్‌ఈఏ అధ్యక్షుడు అప్పలరాజు, ప్రధాన కార్యదర్శి పార్థసారది

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.