ETV Bharat / city

తెదేపా నేతలను పోలీసులే బెదిరించటం దుర్మార్గం:వర్ల - ఏపీ తాజా వార్తలు

రాష్ట్ర డీజీపీకి తెలుగుదేశం పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. తెదేపా నేతలను వైకాపాలో చేరాలని పోలీసులే బెదిరించటం దుర్మార్గమని అన్నారు. సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీని కోరారు.

TDP Varla Letter
TDP Varla Letter
author img

By

Published : Mar 9, 2021, 12:40 PM IST

అనంతపురం జిల్లా నల్లచెరువులో.. తెలుగుదేశం నేతలను వైకాపాలో చేరాలని పోలీసులే బెదిరించటం దుర్మార్గమని.. ఆ పార్టీ సీనియర్‌ నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. సీఐ మధు, ఎస్ఐలు మునీర్ అహ్మద్, శ్రీనివాసులుపై.. చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి లేఖ రాశారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తలమర్లవడ్లపల్లె గ్రామ సర్పంచ్ హర్షవర్ధన్ నాయుడు, అతని అనుచరులపై అక్రమ కేసులు బనాయించారని లేఖలో పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలకు అనుకూలంగా పోలీసు అధికారులు వ్యవహరించటం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని వర్ల రామయ్య అన్నారు.

ఇదీ చదవండి: కూర్మన్నపాలెంలో కొనసాగుతున్న కార్మిక సంఘాల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.