ETV Bharat / city

ఎస్​ఈసీ చర్యలు తీసుకోకుంటే హైకోర్టును ఆశ్రయిద్దాం : చంద్రబాబు

మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. తెలుగుదేశం గళమెత్తుతోంది. పలు ఠాణాల్లో తెలుగు తమ్ముళ్లు ఫిర్యాదులు సైతం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికీ తీసుకెళ్లారు. కొందరు నేతలు చంద్రబాబుకు నేరుగా ఫిర్యాదు చేయగా.. న్యాయ పోరాటం చేద్దామని శ్రేణులకు ధైర్యం చెప్పారు.

ఎస్​ఈసీ చర్యలు తీసుకోకుంటే హైకోర్టును ఆశ్రయిద్దాం : చంద్రబాబు
ఎస్​ఈసీ చర్యలు తీసుకోకుంటే హైకోర్టును ఆశ్రయిద్దాం : చంద్రబాబు
author img

By

Published : Feb 19, 2021, 2:29 AM IST

మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిసినా.. పలు గ్రామాల్లో రాజకీయ వివాదాలకు తెరపడటం లేదు. కృష్ణా జిల్లా పెడన మండలం నందిగామలో వైకాపా మద్దతుదారులు.. తెలుగుదేశం నేతలపై కర్రలతో దాడి చేయటం ఉద్రిక్తతకు దారితీసింది. అధికార పార్టీ నేతలు తమను బెదిరిస్తున్నారంటూ తెదేపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా.. శింగనమల మండలం నాగుల గుడ్డంతాండా సర్పంచ్‌గా గెలిచిన లక్ష్మీదేవి ఇంటిపై వైకాపా శ్రేణులు దాడి చేశాయని.. తెదేపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో, తెదేపా గెలుపును జీర్ణించుకోలేక దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

రీపోలింగ్ లేదా రీకౌంటింగ్..

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పులికొండ, మారెళ్లలో రీపోలింగ్ ‌లేదా రీకౌంటింగ్‌ నిర్వహించాలంటూ.. తెదేపా నేతలు డిమాండ్‌ చేశారు. తమ పార్టీ మద్దతుదారులకు ఆధిక్యం వస్తే అధికార పార్టీ ఒత్తిళ్లతో ఫలితాలు తారుమారు చేశారని కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు.

న్యాయస్థానాన్ని ఆశ్రయిద్దాం..

ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం కుందుర్తిలో ఫలితాలు తారుమారు చేశారని స్థానిక తెదేపా నేతలు.. అమరావతి ఎన్టీఆర్ భవన్​‌లో చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలపై ఎస్​ఈసీ సరైన చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిద్దామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఫలితాలు తారుమారు చేశారు..

మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో దౌర్జన్యంగా ఫలితాలు తారుమారు చేశారని.. తెదేపా నేతలు ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కు మరోసారి ఫిర్యాదు చేశారు. బ్యాలెట్‌ పత్రాలతో పాటు.. వీడియో రికార్డింగ్‌లూ భద్రపరుస్తామని ఎస్​ఈసీ హామీ ఇచ్చినట్లు నేతలు స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన తెదేపా మద్దతుదారులపై.. వైకాపా వర్గీయులు దాడులు చేస్తే అరాచక పాలనను ప్రజలే తరిమికొడతారని.. తెదేపా నేతలు హెచ్చరించారు.

ఇదీ చదవండి

రాజకీయ జీవితంలో ఎన్టీఆర్‌ లెజెండ్‌: ఉపరాష్ట్రపతి వెంకయ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.