ETV Bharat / city

వైకాపా పార్లమెంట్​ను తప్పుదోవ పట్టిస్తోంది: ఎంపీ గల్లా జయదేవ్ - వైసీపీ ప్రభుత్వంపై గల్లా జయదేవ్ కామెంట్స్

కోర్టులు వైకాపా ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నా... సర్కారు తన తీరు మార్చుకోవడం లేదని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైకాపా పార్లమెంట్​ను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. 80కి పైగా కేసుల్లో కోర్టుల మొట్టికాయలు తిన్న వైకాపా ప్రభుత్వం... తీరు మార్చుకోకుండా కోర్టులు, జడ్జిలకు దురుద్దేశాలు ఆపాదిస్తోందని విమర్శించారు.

ఎంపీ గల్లా జయదేవ్
ఎంపీ గల్లా జయదేవ్
author img

By

Published : Sep 18, 2020, 10:34 PM IST

వైకాపా ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పార్లమెంటును వైకాపా తప్పుదోవ పట్టిస్తోందన్నారు. తెదేపాపై చేసిన ఒక్క ఆరోపణను కూడా వైకాపా నిరూపించలేకపోయిందని గల్లా స్పష్టం చేశారు. నిష్పాక్షిక విచారణ పేరుతో కేసులను సీబీఐకి అప్పగిస్తానంటోందన్నారు. సీబీఐకి అప్పగించడం అంటే నిష్పాక్షిక విచారణలో సర్కారు విఫలమైందనే అర్థమన్నారు.

80కి పైగా కేసుల్లో హైకోర్టు, సుప్రీంకోర్టు సర్కారుకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చాయని గల్లా జయదేవ్ గుర్తు చేశారు. తన తీరును సవరించుకోవాల్సిన వైకాపా.. కోర్టులకు, జడ్జిలకు దురుద్దేశాలు ఆపాదిస్తోందని విమర్శించారు. చట్టం, న్యాయంపై గౌరవం లేదని వైకాపా సర్కారు తీరు నిరూపిస్తోందని వ్యాఖ్యానించారు. సీఎంపై పదేళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్న సీబీఐ కేసుల సంగతేంటి? గల్లా జయదేవ్‌ పార్లమెంట్​ సాక్షిగా ప్రశ్నించారు.

ఇదీ చదవండి : శనివారం నుంచి బార్లు తెరిచేందుకు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.