Dola On DSC: అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పిన జగన్ రెడ్డి.. మూడేళ్లుగా నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పారని తెదేపా ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. ఖాళీగా ఉన్న 20వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టకుండా ఎస్జీటీ పోస్టులను రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రకటించడం దారుణమని దుయ్యబట్టారు. జిల్లాకు 397 పోస్టుల చొప్పున 12 జిల్లాల నుంచి 4,764 ఎస్జీటీ పోస్టుల్నీ రద్దు చేస్తూ ప్రభుత్వం ఈ నెల 24 ఉత్తర్వులిచ్చిందని ధ్వజమెత్తారు. పైగా ఆదర్శ పాఠశాల్లో పనిచేస్తున్న 3, 260 పోస్టులకు సర్వీస్ నిబంధనల కోసమే వీటిని విలీనం చేస్తున్నట్లు ప్రకటించిందని మండిపడ్డారు. మొన్న ఉపాధ్యాయులతో మద్యం అమ్మించిన ప్రభుత్వం.. నిన్న రోడ్డెక్కించింది.. ఇప్పుడు పోస్టులను రద్దు చేసి పొట్ట కొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త పోస్టులు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఉన్నవి తీసేయడం.. తీరని ద్రోహం చేయడమే అని మండిపడ్డారు.
ఇదీ చదవండి: High Court Judges: 'గేదెల రామ్మోహన్ రావు సమాజానికి ఎనలేని సేవలందించారు'