ETV Bharat / city

TDP On Amravati Maha sabha: 'అమరావతి ఐకాస సభ.. వైకాపా ప్రభుత్వ పతనానికి నాంది'

TDP On Amravati Maha sabha: అమరావతి ఐకాస సభ.. వైకాపా ప్రభుత్వ పతనానికి నాంది అని తెదేపా నేతలు అన్నారు. తిరుపతిలో తలపెట్టిన రైతుల సభ.. చరిత్ర సృష్టించిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. ఇకనైనా సీఎం జగన్ కళ్లు తెరిచి.. అమరావతికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు.

author img

By

Published : Dec 18, 2021, 4:05 PM IST

ashokbabu on Amravati Maha sabha
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/18-December-2021/13943065_tdppp.JPG

TDP On Amravati Maha sabha: తిరుపతిలో అమరావతి సభ చరిత్ర సృష్టించిందని తెలుగుదేశం పార్టీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అశోక్​బాబు అన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆశీస్సులతో విజయవంతమైన సభ అని పేర్కొన్నారు. అకుంఠితదీక్షతో చేపట్టిన పాదయాత్రను ప్రారంభం నుంచి సభ వరకు ప్రజలందరూ స్వచ్ఛందంగా అండగా నిలవడం విశేషమని కొనియాడారు. ఒక్క వైకాపా తప్ప రాష్ట్రంలోని అన్ని పార్టీలు, యువజన, కార్మిక, రైతు, ప్రజాసంఘాలన్నీ రాజధాని రైతులకు జైకొట్టాయన్నారు. అధికార వైకాపా ఎన్ని కుట్రలకు పాల్పడినా, ఎన్ని కేసులు బనాయించినా, ఆటంకాలు సృష్టించినా భగవంతుడితో పాటు రాష్ట్ర ప్రజలందరూ అమరావతివైపే నిలిచారని సోమిరెడ్డి తెలిపారు.

  • తిరుపతిలో అమరావతి సభ చరిత్ర సృష్టించింది.5కోట్ల ఆంధ్రుల ఆశీస్సులతో సక్సెస్ అయింది.అకుంఠితదీక్షతో చేపట్టిన పాదయాత్రను ప్రారంభం నుంచి సభ వరకు ప్రజలు స్వచ్ఛందంగా అండగా నిలవడం విశేషం.ఒక్క @YSRCParty తప్ప అన్ని పార్టీలు, యువజన, కార్మిక, రైతు, ప్రజాసంఘాలన్నీ అమరావతికి జైకొట్టాయి.(4/1) pic.twitter.com/FWTT6ZqLlv

    — Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) December 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కేంద్రంలో అత్యంత బలీయమైన శక్తిగా ఉన్న భాజపా ప్రభుత్వమే రైతుల పోరాటానికి తలొగ్గి మూడు కీలక బిల్లులను వెనక్కి తీసుకుందన్నారు. ఇక్కడేమో రైతులు నెలల తరబడి దీక్షలు చేసినా, వందల కిలోమీటర్లు నడిచినా జగన్మోహన్ రెడ్డి మనస్సు కరగకపోవడం దురదృష్టకరమన్నారు. మంచి మనస్సు చేసుకోకపోగా రైతుల సభకు పోటీగా వికేంద్రీకరణ సభ పెట్టి కాలేజీల యాజమాన్యాలను బెదిరించి విద్యార్థులను తరలించి గబ్బు పట్టడం అవసరమా అని నిలదీశారు. ఇప్పటికే ఘోరంగా విఫలమయ్యారని, ఇకనైనా కళ్లు తెరిచి అప్పట్లో ప్రతిపక్ష నేతగా జగన్‌రెడ్డి మద్దతు పలికిన అమరావతికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని హితవుపలికారు.

అమరావతి ఐకాస సభ.. వైకాపా ప్రభుత్వ పతనానికి నాంది. సీఎం జగన్ మూడు ముక్కలాటతో పరిశ్రమలు తరలివెళ్లాయి. ఒప్పందాలు చేసుకున్నవన్నీ పొరుగు రాష్ట్రాలకు వెళ్లాయి. ఓఆర్‌ఆర్ పరిధి తగ్గించడం.. రాష్ట్రాభివృద్ధిని కుదించడమే - అశోక్‌బాబు, తెదేపా నేత

ఇదీ చదవండి:

కాసేపట్లో పెళ్లి.. వరుడ్ని చితకబాదిన వధువు కుటుంబం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.