ETV Bharat / city

'దళితులపై దమనకాండ'... తెదేపా పుస్తకం విడుదల - నక్కా ఆనంద్ బాబు

వైకాపా పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని తెదేపా నేతలు నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య విమర్శించారు. 'దళితులపై దమనకాండ - దళిత ద్రోహి జగన్ ' పేరిట పుస్తకాన్ని విడుదల చేశారు.

attacks on dalits in ap
attacks on dalits in ap
author img

By

Published : Aug 26, 2020, 3:32 PM IST

'దళితులపై దమనకాండ - దళితద్రోహి జగన్ ' పేరిట పుస్తకాన్ని తెదేపా ఎస్సీ విభాగం విడుదల చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. శిరోముండనం ఘటన జరిగి 40 రోజులైతే... ముఖ్యమంత్రి ఇన్ని రోజుల తరువాత స్పందించారని నేతలు విమర్శించారు. జరిగిన దారుణం రాష్ట్రపతికి తెలియబట్టే, అభద్రతతో ముఖ్యమంత్రి మాట్లాడారని దుయ్యబట్టారు.

జగన్ ప్రభుత్వం దళితులపై సాగిస్తున్న దమనకాండను పూర్తి వివరాలతో, ఆధారాలతో పుస్తకంలో వివరించామని వెల్లడించారు. ఈ పుస్తకం చదివితే రాష్ట్రంలోని దళితుల పరిస్థితేమిటో ప్రతి ఒక్కరికీ తెలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, సలహాదారులు, అధికారులు ఈ పుస్తకం చదివి ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని దళితులకు ముఖ్యమంత్రి జగన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

మూడు రాజధానులపై హైకోర్టు ఉత్తర్వులను అడ్డుకోం: సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.