రాష్ట్రానికి మూడు రాజధానులన్న జగన్ వ్యాఖ్యలపై తెదేపా నేతలు మండిపడుతున్నారు. రాజధాని అమరావతికి గతంలో జగన్ మద్దతు పలికారని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ మల్టిపుల్ క్యాపిటల్స్ లేవని... ప్రాంతీయ ద్వేషాలకు జగన్ ఆజ్యం పోస్తున్నారని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అమరావతిలో హైకోర్టు పెట్టారని పేర్కొన్నారు. రాజధాని ప్రకటన తర్వాతే అమరావతిలో భూములు కొన్నామన్నారు. ఎవరైనా అక్రమంగా భూములు కొంటే చర్యలు తీసుకోవచ్చన్నారు.
ఒకే రాజధాని ఉండాలి
ఏ రాష్ట్రానికైనా ఒకే రాజధాని ఉండాలని మాజీ మంత్రి నారాయణ అన్నారు. తనకు అమరావతిలో 3,129 ఎకరాలు ఉన్నాయని గతంలో చెప్పారని... ఇప్పుడేమో నాకు 55 ఎకరాలు ఉన్నాయని వైకాపా ప్రభుత్వం అంటోందని మండిపడ్డారు. 2013 డిసెంబరులోనే అమరావతిలో భూములు తీసుకున్నట్లు పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు.
ఇదీ చదవండి: