ETV Bharat / city

ఆ గృహాలను వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయండి: తెదేపా

తెదేపా హయాంలో చేపట్టిన గృహ నిర్మాణాలను తక్షణమే లబ్ధిదారులకు అందించాలని తెదేపా నేతలు బుద్దా వెంకన్న, అశోక్​బాబు, నక్కా నందబాబు డిమాండ్ చేశారు. తమ అధినేత చంద్రబాబుపై కక్షతోనే ఆరు లక్షల ఇళ్లను.. ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. ప్రభుత్వం చెబుతున్న ఇళ్ల స్థలాల పంపిణీ అంతా అవినీతిమయమని దుయ్యబట్టారు.

tdp leaders fiers on ycp
tdp leaders fiers on ycp
author img

By

Published : Jul 6, 2020, 6:54 PM IST

వైకాపా ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో అవినీతికి పాల్పడుతోందని తెదేపా నేతలు ఆరోపణలు గుప్పించారు. తెదేపా హయాంలో నిర్మించిన ఆరు లక్షల ఇళ్లు సిద్ధంగా ఉన్నా... వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తయిన ఇళ్లను 15 నెలల నుంచి పంపిణీ చేయకుండా వదిలేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వం చెబుతున్న 25 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ.. పెద్ద కుంభకోణమని ఆరోపించారు. వీటిపై సీబీఐ విచారణ జరిపిస్తే వాస్తవాలన్నీ బయటపడతాయని అన్నారు.

చంద్రబాబుకు పేరొస్తుందనే...

చంద్రబాబుకు ఎక్కడ పేరొస్తుందన్న భయంతోనే... వైకాపా ప్రభుత్వం 6 లక్షల ఇళ్ల పంపిణీ నిలిపివేసిందని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎకరం నాలుగు, ఐదు లక్షలు విలువ కూడా చేయని పొలాలను... 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు కొనుగోలు చేశారని అన్నారు. ఇళ్ల స్థలాల వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

సీబీఐ విచారణ జరపాలి..

రాష్ట్రంలో 6 లక్షల ఇళ్లు సిద్ధంగా ఉన్నా లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వడం లేదు? 15 నెలల నుంచి పూర్తైన ఇళ్లను అలా వదిలేయటం ఎంతవరకు సమంజసం? తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలన్నీ పాంటిచాం. వైకాపా ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాల భూసేకరణలో 3 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. సీబీఐ విచారణ జరిగితే అక్రమాలు బయట పడతాయి - అశోక్ బాబు, తెదేపా ఎమ్మెల్సీ

'స్కీముల పేరుతో స్కాములా?'

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన గృహ నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు వెంటనే అందజేయాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులుతో కలిసి ఆయన మాట్లాడారు. వేర్వురు స్కీమ్​ల పేరుతో వైకాపా ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అవినీతికి వత్తాసు పలికే అధికారులను విడిచిపెట్టబోమని హెచ్చరించారు.

50 వేలు వసూలు చేస్తున్నారు..

రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వ‌చ్చాక ప్రతి స్కాంల‌కు నిల‌య‌మైందని మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యాఖ్యానించారు. ఆమదాల‌వ‌ల‌స‌లో స్పీక‌ర్‌, ఆయ‌న కుమారుడు ప్రతి ఇంటి ప‌ట్టాకి రూ.50 వేలు వ‌సూలు చేస్తున్నారని ఆరోపించారు. పేద‌లంద‌రికీ ఇళ్ల పేరుతో రూ.14 వంద‌ల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పాలనంతా అవినీతిమయమే..

రాష్టంలో వైకాపా ఎమ్మెల్యేలు ఇళ్ల స్థలాల పేరుతో భారీ అవినీతికి పాలపడ్డారని ఎమ్మెల్సీ రామకృష్ణ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను తక్షణమే పేదలకు అందచేయాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వమంతా... కుంభకోణలు, అవినీతి, అక్రమాలతో కూడినదని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు అందచేయాలని డిమాండ్ చేస్తూ.. గుంటూరు జిల్లా తెదేపా కార్యాలయంలో ఆ పార్టీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గత ప్రభుత్వం హయాంలో 12లక్షల మందికి ఇళ్లను కేటాయించి మంజూరుకు సిద్ధం చేస్తే.. ఇంతవరకు లబ్దిదారులకు ఇళ్లను కేటాయించకపోవడం దారుణమని తెదేపా నాయకులు కోవెలమూడి రవీంద్ర అన్నారు.

ఇదీ చదవండి:

'పేద‌లంద‌రికీ ఇళ్ల పేరుతో అక్రమాలు చేస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.