ETV Bharat / city

వైకాపా ప్రభుత్వంపై ధ్వజమెత్తిన తెదేపా నేతలు - ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తాజా సమాచారం

వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేతలు మండిపడ్డారు. హైకోర్టు తీర్పుతోనైనా వైకాపా నాయకులు తమ బుద్ధిని మార్చుకుని.. రాజధానిని అభివృద్ధి చేయాలన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఉంటానన్న జగన్ రెడ్డి.. వారిని నట్టేట ముంచాడని ఆక్షేపించారు.

TDP leaders
TDP leaders
author img

By

Published : Mar 6, 2022, 3:55 PM IST

రైతులు న్యాయ దేవతకు మొక్కడం వైకాపాకి వెకిలిగా ఉందా అని తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దుయ్యబట్టారు. మూడేళ్లుగా మూడు రాజధానుల పేరుతో చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్న వైకాపా నేతలకు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మింగుడు పడటం లేదని ధ్వజమెత్తారు. కోర్టు తీర్పుతోనైనా బుద్ధి తెచ్చుకోకుండా... చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఏలూరి మండిపడ్డారు. రాజధాని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిసినా మొండిగా ప్రవర్తించి ప్రజాధనం వృథా చేశారని ఏలూరి దుయ్యబట్టారు. ఇకనైనా మాస్టర్ ప్లాన్ అమలు చేసి రాజధానిని నిర్మించాలని కోరారు. రైతులు చేసిన పోరాటానికి ఫలితం దక్కిందన్నారు.

గన్నవరం చేరిన నిమ్మల సైకిల్ యాత్ర

ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడి సైకిల్ యాత్ర కృష్ణాజిల్లా గన్నవరం చేరింది. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, తెదేపా నేతలు ఘన స్వాగతం పలికారు. తెదేపా హయాంలో 90శాతం ఇళ్ల నిర్మాణం పూర్తైందని... కేవలం పదిశాతం పనులు పూర్తి చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. వెంటనే వాటిని పూర్తి చేసి.. లబ్ధిదారులకు అందిచాలని డిమాండ్ చేశారు.

మూడేళ్ల తర్వాత ఇప్పుడు...

ముసాఫిర్ ఖానాను చంద్రబాబు అభివృద్ధి చేస్తే.. ప్రారంభం కాకుండా వైకాపా ప్రభుత్వం నిలిపివేసిందని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మండిపడ్డారు. చంద్రబాబు చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వైకాపా ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. జగన్ మాత్రం పది నెలల్లో తన ప్యాలెస్ కట్టుకున్నారని దుయ్యబట్టారు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు ప్రారంభిస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. రాజధాని కోసం రైతులు వేల ఎకరాలు ఇస్తే... వారిని రోడ్డు మీద కూర్చోబట్టారని మండిపడ్డారు. పేద ప్రజలు కోసం చేపట్టిన అన్న క్యాంటీన్లను మూసివేశారన్నారు. జగన్ పాలనపై ప్రజలు విసిగిపోయారని... త్వరలోనే వైకాపాకి తగిన గుణపాఠం నేర్పిస్తారన్నారు.

కన్నబాబు తన పరువు తానే తీసుకున్నాడు..

రైతులు, వ్యవసాయం గురించి పెద్దపెద్దమాటలు మాట్లాడిన కన్నబాబు తన పరువు తానే తీసుకున్నాడని తెలుగు రైతు రాష్ట్రఅధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి దుయ్యబట్టారు. రైతులు ఏం పండిస్తే వాటిని గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొంటుదన్న హామీని జగన్ రెడ్డి ఎందుకు నిలబెట్టుకోలేకపోయాడని నిలదీశారు. ధాన్యం రైతులకు బకాయిలు ఇవ్వకుండా.. అడిగిన వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఉంటానన్న జగన్ రెడ్డి వారిని నట్టేటముంచాడని ఆక్షేపించారు. పంటలబీమా, ఇన్​పుట్ సబ్సిడీ, గిట్టుబాటు ధర, సబ్సిడీపై యంత్రపరికరాలు, డ్రిప్ పనిముట్లు, ఎరువులు ఏవీ ఇవ్వకుండా తాడేపల్లి ప్యాలెస్​లో కూర్చొని వ్యవసాయాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పుకుంటే సరిపోదని హితవు పలికారు.

ఇదీ చదవండి : Minister Vellampalli on CBN: చంద్రబాబు గ్రాఫిక్స్​తో పాలన చేశాడు : మంత్రి వెల్లంపల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.