ETV Bharat / city

అరెస్టులు కక్షసాధింపు చర్యలే... ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు! - మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్ వార్తలు

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టులను తెదేపా నేతలు ఖండించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పేరున్న కుటుంబాలపై బురద జల్లేందుకే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. దురుద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఇలా కక్ష సాధింపు, పగ, ప్రతీకారాలకు పాల్పడితే.... జగన్ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

tdp leaders comments on govt
తెదేపా నేతల ఆగ్రహం
author img

By

Published : Jun 13, 2020, 10:45 PM IST

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ చర్యలను తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం కక్ష సాధింపే చర్యల్లో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీనేతలు ధ్వజమెత్తారు. అవినీతిని ప్రశ్నించినందుకే అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు ఆగ్రహం...

రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నేతలను వరుస అరెస్టులు చేస్తున్నారని.... ఇలాంటి దుర్మార్గాలను తమ పార్టీ నైతిక స్థైర్యంతో.. మనోనిబ్బరంతో ఎదుర్కొంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతికారేచ్ఛతో సీఎం జగన్ రగిలిపోతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై తెదేపా చేస్తున్న పోరాటాల్ని జగన్‌ ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఏడాది వైఫల్యాలపై జనాల దృష్టి మరల్చేందుకే... అరెస్టులు చేస్తున్నారని ఆక్షేపించారు. జగన్‌ జైలుకు వెళ్లారన్న కక్షతోనే తెదేపా నాయకులను జైళ్లకు పంపిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తప్పుడు రికార్డులతో కేసులు పెట్టారని చంద్రబాబు విమర్శించారు.

అచ్చెన్నాయుడి అక్రమ అరెస్టును పక్కదారి పట్టించేందుకే జేసీ ప్రభాకర్‌రెడ్డిని, ఆయన తనయుడిని అరెస్టు చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మండిపడ్డారు.

లొంగితే పార్టీలోకి...లేకుంటే జైల్లోకి అన్న రీతిలో జగన్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోంది - దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీమంత్రి

ఒక తప్పు కప్పిపుచ్చడానికి జగన్ 100 తప్పులు చేస్తున్నారు. తప్పులను సరిదిద్దుకునే ధైర్యం ముఖ్యమంత్రికి లేదు. తప్పులు, అసహనం, కక్షసాధింపే జగన్ పతనానికి బాటలు. - యనమల

వైకాపా ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతుంటే సీఎం జగన్‌కు కనబడటంలేదా.... అని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. బీసీ నాయకులను అణగదొక్కడమే ప్రభుత్వ ద్యేయమని దుయ్యబట్టారు.

ప్రతిపక్ష నాయకులే లక్ష్యంగా అరెస్టులు సాగుతున్నాయని రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ ఆక్షేపించారు.

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంలో తాజా సవరణలతో అనేక ఉద్యోగాలు పోతాయని తెదేపా సీనియర్‌ నేత అశోక్‌గజపతిరాజు ఆందోళన వ్యక్తం చేశారు.

సీఎం జగన్ తెలుగుదేశాన్ని నిర్వీర్యం చేయాలనే కక్షతో అరెస్టులు చేయిస్తున్నారని బొండా ఉమ ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అరెస్టులే ఉంటాయని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు.

బలమైన గొంత నొక్కేయాలనే కక్షతోనే ఇదంతా చేస్తున్నారని... 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి పట్ల ఇటువంటి వైఖరి సరికాదని ఎంపీ రామ్మోహన్మాయుడు‌ అన్నారు.

-

ఇవీ చదవండి:

నన్ను సంప్రదించారు... చట్ట ప్రకారమే అరెస్టు: సభాపతి తమ్మినేని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.