"అమిత్ షాతో రాష్ట్ర సమస్యలు చర్చించారని చెప్పటం అబద్ధం" - tdp leader varlla ramaiah fire on cm jagan news
సీఎం జగన్ దిల్లీ పర్యటనపై తెదేపా నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. కేంద్ర హోం శాఖ మంత్రితో భేటీ అయి రాష్ట్ర సమస్యలు చర్చించారని చెప్పటం అబద్ధమని అన్నారు. ప్రత్యేక హోదా గురించి అడిగే ధైర్యం జగన్కు ఉందా అని ప్రశ్నించారు

tdp-leader-varlla-ramaiah-comments-on-cm-jagan-delhi-tour
ముఖ్యమంత్రి జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ ఆయి రాష్ట్ర సమస్యలు చర్చించారని ప్రకటించటం అబద్ధమని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. నిన్న పుట్టిన రోజు సందర్భంగా అమిత్ షా క్షణం తీరిక లేకుండా ఉన్నారని తెలిపారు. జగన్ కేవలం జన్మదిన శుభాకాంక్షలు చెప్పి బొకే ఇచ్చారని తమకున్న సమాచారమని చెప్పారు. ప్రత్యేక హోదా గురించి అడిగే ధైర్యం జగన్ కు ఉందా అని ప్రశ్నించారు. అసత్యాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్నారు. పేదలకు ఇళ్ళు ఇప్పిస్తే ఎమ్మెల్యే వంశీపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. అఖిలప్రియ ఇంటిపై పోలీసులు అంత అరాచకం చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.
"అమిత్ షాతో రాష్ట్ర సమస్యలు చర్చించారని చెప్పటం అబద్ధం"
ఇదీ చదవండి : కొనసాగుతున్న మృతదేహాల గుర్తింపు ప్రక్రియ