హిట్లర్ మంత్రివర్గంలో గోబెల్స్ ఎలానో.. జగన్ కేబినెట్లో మంత్రి బొత్స అలా అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. మంత్రి బొత్స అసత్యవాది, అవినీతిపరుడు అని గత చరిత్ర చెబుతోందన్నారు. దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన బొత్స.. విజయనగర రాజుల కోటను కొనే స్థాయికి ఎలా చేరారో ఆయనే చెప్పాలని నిలదీశారు.
వోక్స్ వ్యాగన్ కంపెనీ రాష్ట్రం నుంచి తరలిపోవడానికి కారణం బొత్స అన్న వర్ల.. ఆయన కుటుంబం ఏ వ్యాపారం, ఏ ఉద్యోగం చేసి ఈ స్థాయికి చేరిందో చెప్పాలని ప్రశ్నించారు. రాజధాని అమరావతిపై అడుగడుగునా మంత్రి బొత్స విషం కక్కుతున్నారని ఆరోపించారు. వైకాపా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షురాలు జోనీ కుమారి ఆత్మహత్యాయత్నానికి సీఎం జగనే కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సీఎంను కలవాలని విజయసాయి కాళ్లు పట్టుకునే స్థాయికి ఎందుకు దిగజార్చారన్నారు.
ఇదీ చూడండి: