ముస్లిం నేతల నిర్భంధంపై తెదేపా శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలన.. దాడులు, కక్షలు, వేధింపుల చుట్టూ సాగుతోందని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, పోరాడితే అక్రమంగా అరెస్ట్లు చేయటం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. నేరస్తులు రోడ్లపై తిరుగుతుంటే.. న్యాయం కోరే వాళ్లు మాత్రం జైలుపాలయ్యే పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ వైఖరిని శాసనసభలో ఎండగడతామని స్పష్టం చేశారు.
సలాం కుటుంబానికి న్యాయం చేయాలంటూ ముస్లిం సంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. శాసనసభ సమావేశాల నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమైన అధికారులు ముస్లిం సంఘాల నాయకులను ఎక్కడికక్కడ నిర్భందించారు. ఇలాంటి వైఖరి సరికాదని తెదేపా నేతలు తప్పుబట్టారు.
ఇవీ చూడండి...