రాష్ట్రంలో రూ.750 విలువ చేసే ఫేస్ మాస్క్ ప్యాకెట్ ధర రూ.2000లకు చేరటాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తప్పుబట్టారు. ప్రపంచాన్ని కరోనా కబళిస్తోందని వార్తలు వస్తున్నా.. ముఖ్యమంత్రి ఇప్పటికీ కళ్లు తెరవలేదని మండిపడ్డారు. ఫేస్ మాస్క్ ఎమ్మార్పీ కంటే అధిక మొత్తంలో విక్రయిస్తున్న బిల్లు తాలూకు వివరాలను లోకేష్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రజల్లో ఆందోళన నెలకొందని దుయ్యబట్టారు. అసలే రివర్స్ పాలన, ఆపై రివర్స్ టెండరింగ్.. వెరసి రాష్ట్రంలో ఈ తరహా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి: