అమరావతి రైతులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే ప్రభుత్వం అన్యాయంగా సంకెళ్లు వేసి జైలుకు పంపుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టైన వారిని వెంటనే విడుదల చేయాలని నిరహార దీక్ష చేస్తున్న రైతుల కుటుంబసభ్యులను ఉమా పరామర్శించారు.
తెదేపా వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉద్యమం జరగకుండా చూసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని దేవినేని ఉమా ఆరోపించారు. 5కోట్ల ప్రజల కోసం 29వేల మంది రైతులు తమ భూములను త్యాగం చేశారని ఉమా అన్నారు. ఈ త్యాగాన్ని ప్రభుత్వం కాలరాస్తోందన్ని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: అమరావతి రైతుల బెయిల్ పిటిషన్పై విచారణ 5కి వాయిదా