కొవిడ్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. కరోనాకు చికిత్స పొందుతూ.. సరిపడా ఆక్సిజన్ అందక విజయనగరంలోని ఆస్పత్రిలో మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆక్సిజన్‌ను నల్లబజారులో అమ్ముతున్న కంపెనీలపై చర్యలు తీసుకోకపోవటంపై మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండి: 'ఆక్సిజన్ లేక ప్రజల ప్రాణాలు పోతుంటే.. జగన్ ఐపీఎల్ మ్యాచ్‌లు చూస్తున్నారు'