తుంగభద్ర పుష్కరాల నిర్వహణలో వైకాపా సర్కారు విఫలమైందని తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరాంప్రసాద్ విమర్శించారు. పుష్కరాలతో పాటు పనులూ కొనసాగుతుండటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని మండిపడ్డారు. హిందూ సంప్రదాయల పట్ల జగన్ నిర్లక్ష్య ధోరణి మరోమారు బయటపడిందని దుయ్యబట్టారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పిండప్రదానాలు చేయించే పురోహితులకు గుర్తింపు కార్డులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని బుచ్చిరాంప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల సహనాన్ని పరీక్షిస్తున్నారని ధ్వజమెత్తారు. పురోహితులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయటంతో పాటు తక్షణమే భక్తులకు అన్ని వసతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : పోలవరం వద్ద వాజ్పేయి విగ్రహం పెట్టాలి: సోము వీర్రాజు