తెలుగునాట వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడైన గిడుగు రామ్మూర్తి జయంతి రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న ప్రపంచవ్యాప్త తెలుగువారందరికీ తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu) శుభాకాంక్షలు తెలిపారు. వాడుకలోని తెలుగు భాష ద్వారా ప్రపంచ సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం సామాన్యుల చేతికి వచ్చేందుకు మూలకారణం రామ్మూర్తి గారే అని కొనియాడారు.
-
తెలుగునాట వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడైన గిడుగు రామమూర్తి గారి జయంతి రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న ప్రపంచవ్యాప్త తెలుగువారందరికీ శుభాకాంక్షలు.వాడుకలోని తెలుగు భాష ద్వారా ప్రపంచ సాహిత్యం,చరిత్ర,విజ్ఞానం సామాన్యుల చేతికి వచ్చేందుకు మూలకారణం రామమూర్తి గారు(1/3) pic.twitter.com/D3FvzzWGXk
— N Chandrababu Naidu (@ncbn) August 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">తెలుగునాట వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడైన గిడుగు రామమూర్తి గారి జయంతి రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న ప్రపంచవ్యాప్త తెలుగువారందరికీ శుభాకాంక్షలు.వాడుకలోని తెలుగు భాష ద్వారా ప్రపంచ సాహిత్యం,చరిత్ర,విజ్ఞానం సామాన్యుల చేతికి వచ్చేందుకు మూలకారణం రామమూర్తి గారు(1/3) pic.twitter.com/D3FvzzWGXk
— N Chandrababu Naidu (@ncbn) August 29, 2021తెలుగునాట వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడైన గిడుగు రామమూర్తి గారి జయంతి రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న ప్రపంచవ్యాప్త తెలుగువారందరికీ శుభాకాంక్షలు.వాడుకలోని తెలుగు భాష ద్వారా ప్రపంచ సాహిత్యం,చరిత్ర,విజ్ఞానం సామాన్యుల చేతికి వచ్చేందుకు మూలకారణం రామమూర్తి గారు(1/3) pic.twitter.com/D3FvzzWGXk
— N Chandrababu Naidu (@ncbn) August 29, 2021
ప్రజలలో అక్షరాస్యత పెరగాలంటే మాతృభాషలోనే బోధన జరగాలని రామ్మూర్తి విశ్వసించారని... అందుకే ఏకంగా గిరిజన భాషా మాధ్యమంలో ఒక పాఠశాలనే తెరిచారని కొనియాడారు. అటువంటిది తెలుగుకు, సంస్కృతానికి తేడా తెలియని వైకాపా పాలనలో గిడుగు ఆకాంక్షలు నీరుగారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బోధనా భాషగా, పాలనా భాషగా ఉన్నప్పుడు ఏ భాషకైనా మరింత రాణింపు ఉంటుంది. తెలుగు భాషకు వైకాపా ఆ ప్రాప్తం లేకుండా చేస్తోందని ఆరోపించారు. తెలుగు భాషను నాశనం చేసేందుకే కంకణం కట్టుకున్నట్టుగా వ్యవహరిస్తోన్న ఈ ప్రభుత్వం నుంచి మన అమ్మ భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వారిపైనా ఉందన్నారు.
ఇదీ చదవండి