తెలుగుదేశం అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి సాయంత్రం ఆరున్నర గంటలకు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చారు.
ఈ నెల 17వ తేదీకి అమరావతి ఉద్యమం ప్రారంభమై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి : మూడు రాజధానులు కావాలని ఎవరడిగారు?: అచ్చెన్నాయుడు