వైకాపా ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని ఇండో - అమెరికన్ బ్రాహ్మణ సంఘం ఛైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ మండిపడ్డారు. శ్రీశైలం ఆలయంలో జరిగిన కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాల ఆస్తులపై వైకాపా ప్రభుత్వం కన్నేసిందని, దేవాలయ భూముల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం జీవో తేవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. నవరత్నాల కోసం కార్పొరేషన్ల నిధులను దారి మళ్లించడం సరికాదని సూచించారు.
ఇదీ చదవండి : 'స్పందన' పై సచివాలయంలో.. ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్