రాష్ట్రంలో పేదరికం పోవాలన్నా, సామాన్య ప్రజల కష్టాలు తీరాలన్నా తెదేపా అధికారంలోకి రావాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రైతులకు, పేదలకు న్యాయం చేసేది తెలుగుదేశమేనని స్పష్టం చేశారు. ‘మీరు ఎక్కడున్నా జన్మభూమి అభివృద్ధికి చేస్తున్న కృషి మరవలేనిది. రాబోయే రోజుల్లోనూ పుట్టిన ప్రాంత అభివృద్ధికి పునరంకింతం కావాలి. తెదేపా బలోపేతానికి సహకారం అందించాలి’ అని వివిధ దేశాల్లోని తెలుగువారికి విజ్ఞప్తి చేశారు. తెదేపా 40 వసంతాల వేడుకలను 40 దేశాల్లోని 200 నగరాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారితో వీడియో సమావేశం ద్వారా మాట్లాడారు. ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు హైదరాబాద్‌ను నాలెడ్జి హబ్‌గా తయారు చేసేందుకు విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు తదితర మౌలిక సౌకర్యాలను కల్పించాం. దీంతో సంపద సృష్టి జరిగింది. రైతులు, పేదల పిల్లలు కూడా ప్రపంచం నలుమూలలకు వెళ్లి స్థిరపడ్డారు’ అని పేర్కొన్నారు. ‘రాష్ట్ర విభజన తర్వాత అమరావతి నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. తెలుగుజాతి పూర్వవైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని పనిచేశా. దేశ విదేశాల్లోని ఎంతోమంది చేయూత అందించారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వచ్చాక అమరావతితో పాటు అన్ని రంగాలనూ ధ్వంసం చేసే కార్యక్రమాలు చేపట్టింది. దీంతో రాష్ట్రం ఉనికినే కోల్పోయే పరిస్థితి తలెత్తింది’ అని విమర్శించారు. ‘తెలుగువారు ఎక్కడున్నా మాతృభూమిపై ఉండే ప్రేమ వెలకట్టలేనిది. సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతున్నారు. ఎప్పుడు, ఏ అవసరం వచ్చినా గ్రామాల అభివృద్ధికి చేయూతనిస్తున్నారు’ అని ప్రశంసించారు.
తెలుగుదేశం పార్టీ 40 వసంతాల వేడుకలను అమెరికాలో ఘనంగా నిర్వహించారు. నార్త్ కెరొలినా రాష్ట్రంలోని షార్లెట్ నగరంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు సమావేశమై ఎన్నారై తెదేపా షార్లెట్ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకూ నెలకొన్న పరిస్థితులపై తమ అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ 40వసంతాల వేడుక సందర్భంగా మెల్‌బోర్న్‌లో పార్టీ అభిమానులు ర్యాలీ నిర్వహించి.. జై తెదేపా ఆకృతిని కార్లతో ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటారు.
తెలుగుదేశం పార్టీ 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికలోనూ వేడుకలు నిర్వహించారు. తెదేపా 40వ వార్షికోత్సవ వేడుకలను పార్టీ సీనియర్ నాయకులు కోమటి జయరాం ఆధ్వర్యంలో 40 నగరాలలో ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని ఎన్నారైలకు ఓ జ్ఞాపకంలా నిలిచిపోయేలా ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెదేపా, నందమూరి అభిమానులు కుటుంబ సమేతంగా ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అమెరికాలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రత్యక్షంగా రాష్ట్ర నాయకులు కూడా పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమాల్లో తెదేపా నాయకులు బీద రవిచంద్ర, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మన్నవ మోహనకృష్ణ, అరిమిల్లి రాధాకృష్ణ, కలపటపు బుచ్చి రాంప్రసాద్, ముళ్లపూడి బాపిరాజు పాల్గొన్నారు.
యూకే, యూరప్‌లలోనూ తెలుగుదేశం పార్టీ 40 వసంతాల వేడుకలను దాదాపు 40కి పైగా నగరాల్లో నిర్వహించారు. తెదేపా నేత వేణు మాధవ్ పోపూరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంగరంగవైభవంగా వేడుకలు జరిగాయి.యూరోప్ టీడీపీ కౌన్సెలర్స్ యూకే - ప్రసన్న నాదెండ్ల, నరేష్ మల్లినేని, చక్రి మొవ్వ, శ్రీకాంత్ యర్రం, మహేంద్ర తాళ్లూరి, నారాయణ రెడ్డి, విక్రమ్ పరిటాల, శివరాం కూరపాటి, సురేష్ కోరం, జయ్‌కుమార్ గుంటుపల్లి, భాస్కర్ అమ్మినేని, ప్రభాకర్ అమిరినేని, శ్రీనివాస్ లగడపాటి, సుందర్ రాజు, శ్రీ కిరణ్ పరుచూరి, శ్రీనివాస్ పాలడుగు, భానూజి కుక్కల, చందు నారా, శ్రీధర్ నారా, చందు జాస్తి, యస్వంత్, రవితేజ లింగ, హర్ష చప్పిడి, మహాశ్వర్ కందుల, రూప్ తేజ, లీలా సాయి ఈదర, రవితేజ నల్లమోతు, నరేంద్ర ములకలపల్లి, సాయి కుర్ర, అభినయ్ కాపా, రవికిరణ్ అర్వపల్లి, వేణు పంగులూరి పాల్గొన్నారు.
* ఐర్లండ్‌లో మురళి రాపర్ల, జర్మనీలో తిట్టు మద్దిపట్ల, శివ, పారిస్‌లో మహేశ్ గొపునూరు, జెనాలో పవన్ జాగర్లమూడి, అనుదీప్ పచ్చాల, బెల్పాస్ట్‌లో దినేశ్ కుదరవల్లి, బ్రసెల్స్‌లో దినేశ్‌వర్మ, పోలండ్‌లో చందు తదితరులు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
ఇదీ చదవండి: రాష్ట్రమంతా పసుపు మయం.. తెదేపా శ్రేణుల్లో నూతనోత్సాహం