తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది. బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అచ్చెన్నాయుడు చంద్రబాబుకు వివరించారు. ఈనెల 9న సభకు విరామం ఇవ్వటంపై టీడీఎల్పీలో చర్చ జరిగింది. అకారణంగా సభకు విరామం ఇవ్వటంపై తెదేపా నేతల అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి బొత్స కుమారుని పెళ్లి రిసెప్షన్ కోసం విరామం ఇచ్చారని నేతలు అధినేత దృష్టికి తీసుకువచ్చారు. నేతల ఇంట్లో పెళ్లిళ్లు, విందులకు సెలవు ఇస్తారా ? అని ప్రశ్నించారు.
వైకాపా వింత పోకడలతో సభ గౌరవం తగ్గిస్తోందని తెదేపా నేతలు మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలపై ప్రభుత్వ దాడిని గవర్నర్ అడ్డుకోలేదన్నారు. స్వయంగా గవర్నర్ పేరుతో సీఎం జగన్ అప్పులు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి
AP Budget Session 2022: పాలనా వికేంద్రీకరణపైనే దృష్టి.. బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్