ETV Bharat / city

పంచాయతీ ఎన్నికలపై ఒడిశా పిటిషన్.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు - ఏపీ ఎన్నికలపై సుప్రీంలో ఒడిశా ప్రభుత్వం పిటిషన్ వార్తలు

ఏపీ పంచాయతీ ఎన్నికలపై ఒడిశా ప్రభుత్వం సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ జరిగింది. ఏపీ తరఫు న్యాయవాదికి పిటిషన్ కాపీ అందించాలని సూచించింది. వచ్చే వారం లోపు సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ap panchayat elections
supreme court issued notice to ap govt
author img

By

Published : Feb 12, 2021, 1:16 PM IST

సుప్రీం కోర్టులో ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ జరిగింది. తమ పంచాయతీలకు ఏపీ ఎన్నికలు నిర్వహిస్తోందని.. అందులో 3 పంచాయతీల పేర్లు మార్చారని పేర్కొంది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ ఎ.ఎం.ఖాన్ విల్కర్ ధర్మాసనం... ఏపీ తరఫు న్యాయవాదికి పిటిషన్ కాపీ అందించాలని సూచించింది.

పిటిషన్‌పై వచ్చే వారంలోపు సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. శనివారం జరిగే రెండో విడత ఎన్నికలపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

జగన్​ను అవంతి.. చంద్రబాబును గంటా ఒకే వేదికపైకి తీసుకురావాలి: నారాయణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.