సర్పంచ్ ఎన్నికలతో (sarpanch elections in andhra pradesh news) పాటు వార్డు సభ్యుల ఎన్నిక కోసం ఆదివారం జరగనున్న పోలింగ్ ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు(SEC Review on Local Body elections news). పోలింగ్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, ఈవీఎంలు తదితర అంశాలపై ఎస్ఈసీ నీలం సాహ్ని(AP SEC Neelam Sahni news) అధికారులతో సమీక్షించారు. దీంతో పాటు ఈ నెల 15వ తేదీన జరగనున్న నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, 12 మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై కూడా చర్చించారు.
ఎన్ని స్థానాలంటే..!
69 సర్పంచి స్థానాల ఎన్నిక కోసం ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేస్తే.. ఇందులో 30 మంది ఏకగ్రీవం కావటంతో పాటు 3 స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 36 సర్పంచి స్థానాలకు రేపు (ఆదివారం) పోలింగ్ నిర్వహించనున్నారు. సర్పంచి స్థానాల(sarpanch elections in andhra pradesh)కు 88 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇక 533 వార్డు సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేస్తే.. 380 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 85 చోట్ల ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని ఎస్ఈసీ వెల్లడించింది. ఫలితంగా 68 చోట్ల మాత్రమే పోలింగ్ జరగనుంది. మొత్తం 350 పోలింగ్ కేంద్రాల్లో పంచాయితీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు పోలింగ్ నిర్వహించనున్నట్టు ఎస్ఈసీ (ap sec news)స్పష్టం చేసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి మద్యాహ్నం 1 గంట వరకూ పోలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. అనంతరం మద్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు.
15న పోలింగ్... 17న కౌంటింగ్
నవంబరు 15వ తేదీన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ (nellore municipal corporation election 2021 news) సహా 12 మున్సిపాలిటీల్లో పోలింగ్ చేపట్టనున్నారు. ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, కుప్పం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీల్లో పోలింగ్ జరుగనుంది. వీటితో పాటు మరో 6 కార్పొరేషన్ల పరిధిలోని 353 వార్డు సభ్యుల ఎన్నిక కోసం నోటిఫై చేస్తే 28 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మొత్తంగా 325 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. నెల్లూరు సహా మిగతా 12 మున్సిపాలిటీల్లో 8,62,066 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 908 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో పాటు 10 జెడ్పీటీసీలు, 123 ఎంపీటీసీల ఎన్నికకూ 15 తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు గానూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ సమయాన్ని నిర్ధరించారు. 17 తేదీన స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు.
ఇదీ చదవండి:
Southern Zonal Council: రేపు తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీ.. ఏపీ అజెండా ఏంటంటే!