Loan Apps Case : రుణ యాప్‌ల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. డబ్బు తీసుకుని తిరిగి చెల్లించని వారిని వేధించే యాప్ నిర్వాహకులు... ఇప్పుడు డబ్బు చెల్లించిన వారినీ వదలడం లేదు. అవసరమొచ్చి అప్పు తీసుకుని వడ్డీతో సహా తిరిగి కట్టేసినా... ఇంకా ఇంకా కట్టాలంటూ రుణ యాప్‌ల ఏజెంట్లు వేధిస్తున్నారు. తీసుకున్న మొత్తానికి వడ్డీ, ఛార్జీలు ఇలా అన్ని కట్టేసామని మొత్తుకుంటున్నా వాళ్లు వినడం లేదు.
Loan Apps Case in Telangana : కాల్స్, మెసేజీలు చేసి విసిగిస్తున్నారు. బంధువులు, మిత్రుల ఫోన్ నంబర్లకు... ఫలానా వ్యక్తి అప్పు తీసుకున్నాడని, తిరిగి చెల్లించడం లేదని, ఫ్రాడ్ అని మెసేజీలు పెడుతున్నారు. అసభ్యకర రీతిలో బూతులతో కూడిన సందేశాలను పంపుతున్నారు. అమ్మాయిల బ్రోకర్ అని బాధితుడి నంబర్ పెట్టి అందరికీ పంపిస్తున్నారు.
Online Loan Apps Cases : తాజాగా రుణ యాప్ ఏజెంట్ల అరాచకపర్వానికి సంబంధించిన మరో ఘటన ఖమ్మంలో వెలుగు చూసింది. మధిరలోని ఎస్సీ కాలనీకి చెందిన ప్రదీప్ లోన్ యాప్ ద్వారా డబ్బు తీసుకున్నాడు. మొదట 5 వేలు, తర్వాత మూడున్నర వేలు అప్పుగా తీసుకున్నాడు. లోన్‌కు అప్లై చేసే ముందు ఫోనులో ఉన్న నంబర్లు అన్నింటినీ యాప్ తీసుకుంటుంది. అలాగే ఫొటోలు అప్‌లోడ్ చేయమని.. ఆధార్ కార్డు, పాన్ కార్డులను కూడా అడుగుతుంది. తర్వాతే లోన్ ప్రాసెస్ ముందుకు కదులుతుంది. డబ్బు అవసరం కావడంతో యాప్ అడిగే వీటన్నింటిని ఇస్తారు చాలా మంది.
అలాగే ప్రదీప్ కూడా యాప్ అడిగినవన్నీ ఇచ్చేశాడు. లోన్ తీసుకుని డబ్బు చేతికొచ్చాక తిరిగి కట్టేశాడు. అప్పు ఇంకా మిగిలే ఉందని, మిగిలిన మొత్తం చెల్లించాలంటూ లోన్ యాప్ ఏజెంట్లు ప్రదీప్‌కు ఫోన్ చేయడం ప్రారంభించారు. తీసుకున్న మొత్తం వడ్డీతో సహా కట్టేశానని, ఇంకేం కట్టాల్సింది లేదని ప్రదీప్ మిన్నకుండిపోయాడు. యాప్ ఏజెంట్లు మాత్రం ప్రదీప్‌కు ఫోన్లు, మెసేజీలు చేస్తూ విసిగిస్తూనే ఉన్నారు.
అప్పు తీసుకున్న సమయంలో ఇచ్చిన ఫొటోలపై అసభ్యకర రీతిలో రాతలు రాసి అందరికీ పంపించారు. ప్రదీప్ తల్లి ఫొటో ఐడీలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. అడిగినంత డబ్బు ఇవ్వకంటే తల్లి ఫొటోలను మార్ఫింగ్ చేసి నెట్‌లో పెడతామని బెదిరించారు. దీంతో ప్రదీప్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి :