ETV Bharat / city

మహానాడుకు లోకేశ్​ ఇలా రావటం తొలిసారి...!

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మహానాడులో కొత్త లుక్​లో మెరిశారు. ఎప్పుడూ పసుపు చొక్కా వేసుకుని మహానాడుకు వచ్చే ఆయన...ఈసారి మాత్రం తెల్లని చొక్కా వేసుకుని హాజరయ్యారు. అంతేకాదు లాక్​డౌన్ కారణంగా రెండు నెలలకు పైగా కనిపించని లోకేశ్..ఏకంగా 20 కేజీల బరువు తగ్గించి స్లిమ్​గా దర్శనమిచ్చారు. వేడుకకు హాజరైన ముఖ్యనేతలంతా లోకేశ్ బరువు తగ్గడంపైనే చర్చించుకున్నారు.

nara lokesh
nara lokesh
author img

By

Published : May 27, 2020, 7:01 PM IST

Updated : May 27, 2020, 9:43 PM IST

కొత్త లుక్​లో కనిపించిన నారా లోకేశ్

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​... మహానాడులో కాస్త డిఫరెంట్​గా..కొత్తగా కనిపించారు. లాక్​డౌన్​ ముందు చూసి..తర్వాత మహానాడులో చూసిన నేతలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కారణం..ఆయన ఎక్కువ మొత్తంలో బరువు తగ్గడమే. అందులోనూ ప్రతి ఏడాది జరిగే మహానాడుకు పసుపు చొక్కాలో హాజరయ్యే లోకేశ్...ఈసారి మాత్రం వైట్ షర్ట్ ధరించి వచ్చారు.

నేతల ఆశ్చర్యం....!

లోకేశ్ బరువు తగ్గడంపై నేతలు యనమల, సోమిరెడ్డి, వర్లరామయ్య, అయ్యన్నపాత్రుడు ఆరా తీశారు. లాక్ డౌన్ సమయంలో ఆరోగ్య సూత్రాలు పాటించానని లోకేశ్ వారితో అన్నారు. మూడు నెలల వ్యవధిలో 20 కేజీలు తగ్గడం ఎలా సాధ్యమైందనే దానిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజూ 45 నిమిషాల పాటు నిర్విరామంగా వ్యాయమం, ఆహారపు అలవాట్లలో మార్పు కారణంగా బరువు తగ్గినట్లు లోకేశ్ వెల్లడించారు.

'నైక్'‌ అనే యాప్‌ ద్వారా తన శరీరాకృతికి తగ్గ వ్యాయామ నియమాలు పాటించడంతోపాటు హెచ్‌ఐఐటి (హై ఇంటెన్సిటి ఇంటర్వెల్‌ ట్రైనింగ్) ద్వారా ఇది సాధ్యమైందని వివరించారు. ఎక్కువ కాయగూరలతోపాటు, మితంగా మాంసాహారం తీసుకుంటున్నానన్నారు. ఈ తరహా వర్కౌట్స్‌, డైట్‌ విధానంతోనే కఠోర వ్యాయామం మితాహారంతో తాను స్లిమ్‌గా మారానన్నారు.

అందుకే ఇలా వచ్చాను..!

మహానాడుకు పసుపు చొక్కా వేసుకు రాలేదేంటి అని లోకేశ్‌ను నేతలు అడిగిన ప్రశ్నకు... బరువు తగ్గడమే కారణమని సమాధానమిచ్చారు. పసుపు చొక్కాలు బాగా లూజ్‌ అయ్యి వేలాడుతూ ఉన్నందునే పాత చొక్కా వేసుకు రావాల్సి వచ్చిందన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పుడున్న శరీరాకృతికి తగ్గట్లుగా చొక్కా కుట్టే దర్జీలు లేదా కొనుగోలు చేసే దుకాణాలు లేకపోవడం కారణంగా ఇలా రావాల్సి వచ్చిందంటూ వివరించారు.

లోకేశ్​ బరువు తగ్గడంపై నేతలు జోకులు పేల్చారు. ఈ రెండు నెలల కాలంలో తాము అంతా బరువు పెరిగితే...మీరు మాత్రం తెలివిగా తగ్గించుకున్నారని అనటంతో నవ్వులు విరిసాయి.

ఇదీ చదవండి:

జీవో 203తో విద్వేషాలు పెంచుతున్నారు: చంద్రబాబు

Last Updated : May 27, 2020, 9:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.