ETV Bharat / city

ఈ నెల 4 నుంచి ప్రత్యేక రైళ్ల స్టాపులు కుదింపు

author img

By

Published : Jun 3, 2020, 8:12 AM IST

రాష్ట్ర పరిధిలో నడిచే కొన్ని ప్రత్యేక రైళ్ల స్టాపులను దక్షిణ మధ్య రైల్వే కుదించింది. ఈ నెల 4వ తేదీ నుంచి కుదించిన స్టాపుల్లో రైళ్లు ఆగవని ప్రకటించింది. ఆయా స్టాపుల్లో చేసుకున్న రిజర్వేషన్లను ప్రయాణికులు రద్దుచేసుకోవాలని...పూర్తి రీఫండ్ అందిస్తామని వెల్లడించింది.

SCR decision for stoppage of trains
ప్రత్యేక రైళ్ల స్టాపుల కుదింపుపై ద.మ.రైల్వే నిర్ణయం

రాష్ట్రంలో ప్రధాన స్టేషన్లలోనే రైళ్లు ఆపాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై దక్షిణ మధ్య రైల్వే సానుకూలంగా స్పందించింది. లాక్‌డౌన్‌ తర్వాత సర్వీసులు పునరుద్ధరిస్తూ రైల్వేశాఖ రాష్ట్రంలోని 71 స్టేషన్లలో రైళ్లు ఆపుతామని ప్రకటించింది. అయితే అన్నిస్టేషన్లలో ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించడం కష్టమనే భావనతో ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి... ప్రధాన స్టేషన్లలోనే రైళ్లు ఆపాలని రైల్వేబోర్డుకు లేఖ రాశారు. ఈ మేరకు 13 రైళ్ల స్టాపేజీల్లో మార్పులు, చేర్పులు చేసినట్లు ద.మ. రైల్వే ప్రకటించింది.

1.సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్లే ఫలక్​నుమా ఎక్స్ ప్రెస్ రైలు గుంటూరు, విజయవాడ స్టేషన్లలో ఆగుతుంది. పిడుగురాళ్ల, తాడేపల్లిగూడెం స్టాపులలో ఆగదు.

2.హౌరా నుంచి సికింద్రాబాద్ వచ్చే రైలు... ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం స్టేషన్లలో ఆగుతుంది. సామర్లకోట, పలాస, ఇచ్చాపురం స్టేషన్లలో ఆగదు.

3.సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్లవలసిన గోల్కొండ ఎక్స్​ప్రెస్​ విజయవాడలో మాత్రమే ఆగుతుంది. కొండపల్లి, రాయనపాడు, క్రిష్ణాకెనాల్, మంగళగిరి, నంబూరు, పెదకాకాని స్టేషన్లలో ఆగదు.

4.గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన గోల్కొండ ఎక్స్​ప్రెస్​​... మంగళగిరి, విజయవాడలో మాత్రమే ఆగుతుంది. కొండపల్లి, రాయనపాడు, నంబూరు, పెదకాకాని స్టేషన్లలో ఆగదు.

5.తిరుపతి నుంచి నిజామాబాద్ వెళ్లే రాయలసీమ ఎక్స్​ప్రెస్​ కడప, ఆదోని స్టేషన్లలో ఆగుతుంది. రేణిగుంట, కోడూరు, ఓబులవారిపల్లిలో, పుల్లంపేట్, రాజంపేట్, నందలూరు, కమలాపురం, ఎర్రగుంట్ల, ముద్దనూరు, కొండపురం, తాడిపత్రి, గూటీలో ఆగదు. కడప, ఆదోని, మంత్రాలయం రోడ్, గుంతకల్ లో ఆగుతుంది.

6.హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్లే గోదావరి ఎక్స్​ప్రెస్​... తాడేపల్లిగూడెం, నిడుద వోలు, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం, ఎలమంచిలి, దువ్వాడలో ఆగదు. విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అనకాపల్లిలో ఆగుతుంది.

7.సీఎస్.ఎం.టీ ముంబాయి నుంచి భువనేశ్వర్ వెళ్లే కోణార్క్ ఎక్స్ ప్రెస్... తాడేపల్లిగూడెం, నిడుదవోలు, సామర్లకోట, పిఠాపురం, తుని, అనకాపల్లి, పలాస, సోంపేట, ఇచ్చాపురంలలో ఆగదు. విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్టణం, శ్రీకాకుళం స్టేషన్లలో ఆగుతుంది.

8.ధన్ పూర్ నుంచి కే.ఎస్.ఆర్ బెంగుళూరు వెళ్లే సంఘమిత్ర ఎక్స్​ప్రెస్​ గూడూరులో ఆగదు. విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, కుప్పంలలో ఆగుతుంది.

9. కే.ఎస్.ఆర్ బెంగుళూరు నుంచి ధన్ పూర్ సంఘమిత్ర ఎక్స్​ప్రెస్​... రేణుగుంట, గూడూరులలో ఆగదు. విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, కుప్పంలలో ఆగుతుంది.

10. విశాఖపట్టణం నుంచి న్యూఢిల్లీ వెళ్లే రైలు ఏపీలో దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, తాడేపల్లి గూడెంలలో ఆగదు. రాజమండ్రి, ఏలూరు, విజయవాడలో ఆగుతుంది.

11. హౌరా నుంచి యశ్వంత్ పూర్ వెళ్లాల్సిన రైలు విజయనగరంలో మాత్రమే ఆగదు. విజయవాడ, రేణిగుంటలో ఆగుతుంది.

12. కే.ఎస్ ఆర్.బెంగుళూరు నుంచి వెళ్లే నిజాముద్దీన్ ఎక్స్​ప్రెస్​ గుంతకల్, అనంతపూర్ లలో ఆగుతుంది.

13. ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్ నుంచి వచ్చే రైలు విజయవాడలో మాత్రమే ఆగుతుంది.

ఇదీ చూడండి:

నాసిరకం పోయి.. నాణ్యత అనే పేరు రావాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.