ETV Bharat / city

కరోనా పోరాట యోధులకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు దీక్షలు - protest in ananthapuram

కరోనా ‘‘ఫ్రంట్ లైన్ వారియర్లకు’ సంఘీభావంగా తెలుగుదేశం నిర్వహిస్తున్న ఆందోళనలు అయిదో రోజూ కొనసాగాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణులు ఆందోళన చేపట్టారు. కరోనా వ్యాప్తి నివారణలో ప్రభుత్వ విఫలమవుతోందంటూ..తెదేపా నేతలు, కార్యకర్తలు నిరసన చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇళ్లల్లోనే దీక్షలో పాల్గొన్నారు. కరోనా పోరాట యోధుల త్యాగాలు నిరుపమానమని కొనియాడారు. అత్యవసర సేవలందిస్తూ.. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు.

Statewide support initiations for corona combat fighters
కరోనా పోరాట యోధులకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు దీక్షలు
author img

By

Published : Jul 27, 2020, 1:06 AM IST

అనంతపురం జిల్లాలో...

అత్యవసర సేవలందిస్తున్న సిబ్బందికి.. రూ.50 లక్షలు బీమా సౌకర్యం కల్పించాలని కళ్యాణదుర్గంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్​ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. కరోనా నివారణలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని కోరారు. ప్రాణాలను లెక్క చేయకుండా విధుల్లో పాల్గొని మృతిచెందిన వారికి కదిరిలో నివాళులు అర్పించారు. కరోనా వ్యాప్తి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడాలని కోరారు. వైరస్​తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

కర్నూలు జిల్లాలో...

కరోనా యోధులకు మద్దతుగా ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి నిరాహారదీక్ష చేపట్టారు. కరోనా నివారణలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అత్యవసర సేవలందిస్తున్న సిబ్బందికి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

ప్రకాశం జిల్లాలో...

కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రెండు లక్షలు రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని.. చీరాలలో తెదేపా నేతలు ఆందోళన చేశారు. వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ పరికరాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. మార్టూరు మండలంలో తెదేపా శ్రేణులు నిరసన దీక్షను చేపట్టారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పిలుపుతో ఈ ఆందోళనలు చేస్తున్నామని అన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో...

కరోనా నియంత్రణలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దీక్ష చేశారు. ప్రభుత్వానికి మద్యంపై ఉన్న శ్రద్ధ కరోనా నియంత్రణపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేశారు. రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. ప్రతి పేద కుటుంబానికి రూ.10 వేలు ఆర్ధికసహాయం అందిచాలని డిమాండ్ చేశారు. వైరస్​తో మృతి చెందిన ఫ్రంట్ లైన్ వారియర్స్​కు రూ.50 లక్షలు చెల్లించాలన్నారు.

గుంటూరు జిల్లాలో...

ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ జీవిత బీమా కల్పించాలంటూ.. బాపట్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు. జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

విశాఖపట్నం జిల్లాలో..

తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడు నలంద కిషోర్ మృతి పట్ల విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యుడు సంతాపం తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఒకరోజు మౌన దీక్ష చేశారు.

నెల్లూరు జిల్లాలో...

నెల్లూరులోని ఆదిత్యనగర్​లో కరోనా బాధితులకు సంఘీభావంగా తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి.. ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టారు. జిల్లాలో అయిదు వేల పడకలను ఏర్పాటు చేయాలని, హోమ్ ఐసోలేషన్​లో ఉండే రోగులను ఆదుకోవాలని కోరారు. వెంకటగిరి లో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నిరాహార దీక్ష చేపట్టారు. కరోనా బాధితులను ఆదుకోవటంలో వైకాపా ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. కరోనా పరీక్షలను వేగవంతం చేసి బాధితులను రక్షించాలని విజ్ఞప్తి చేశారు.

పశ్చిమగోదావరి జిల్లాలో..

కరోనా మహమ్మారిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ..జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెంలో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. కొవిడ్ ఆసుపత్రిలో పడకలు లేక బాధితులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయనగరం జిల్లాలో...

పార్వతీపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేశారు. అత్యవసర సేవలందిస్తూ.. ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు.

ఇదీచదవండి.

లక్షకు చేరువలో కరోనా కేసులు... కొత్తగా 7,627 నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.