ETV Bharat / city

'చంద్రబాబు, అమరావతిపై సీఎం జగన్ కక్ష తీర్చుకోవాలని చూస్తున్నారు'

వైకాపా ప్రభుత్వం, సీఎం జగన్​పై.. తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి జవహర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు, అమరావతి మీదనున్న కక్షతో రైతులకు తీరని ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీలను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

author img

By

Published : Mar 19, 2021, 10:36 PM IST

achennaidu, jawahar allegations on cm jagan
సీఎం జగన్​పై అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి జవహర్ ఆరోపణలు

సీఐడీ పెట్టిన అక్రమ కేసుపై న్యాయస్థానం తీర్పుతోనైనా వైకాపా కళ్లు తెరవాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హితవు పలికారు. అమరావతిపై విషం చిమ్మడం అధికార పార్టీ నేతలకు నిత్యకృత్యంగా మారిందని దుయ్యబట్టారు. జీఓ 41లో ఎలాంటి తప్పు లేనందున హైకోర్టు స్టే ఇస్తే.. అర్థంలేని ఫిర్యాదులు చేసిన వైకాపా నేతలు మరోసారి ప్రజల్లో నవ్వుల పాలయ్యారని ఎద్దేవా చేశారు. పదేళ్ల నుంచి షరతులతో కూడిన బెయిల్ పై తిరుగుతున్న సీఎం జగన్.. స్టే గురించి మాట్లాడటం వింతగా ఉందని ధ్వజమెత్తారు. తన బెయిల్‌ రద్దు చేసి విచారణ పూర్తిచేయమని అడిగే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా? అని ప్రశ్నించారు.

రైతులకు తీరని ద్రోహం

రైతులెవరూ ఫిర్యాదులు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో.. జాన్సన్ అనే వైకాపా కార్యకర్తతో తప్పుడు కేసులు సృష్టించారని అచ్చెన్న ఆరోపించారు. రాజధానిపై నిత్యం నిందలు వేస్తూ అమరావతి బ్రాండ్​ను దెబ్బతీయడంతో పాటు భూములిచ్చిన రైతులకు తీరని ద్రోహం చేశారని విమర్శించారు. నిరాధారమైన కేసులు వేయడం రాజశేఖర్​రెడ్డి హయాం నుంచి వస్తోందన్నారు. రైతుల నుంచి అసైన్డ్ భూములు లాక్కున్న ఘనులు వైకాపాలో అనేకమంది ఉన్నారని మండిపడ్డారు. ఇళ్ల పట్టాల పేరిట 6 వేల ఎకరాల అసైన్డ్ భూములను కోట్లాది రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఆళ్ల రామకృష్టారెడ్డి ఇకనైనా తన విలక్షణ నటనకు తెరదించాలన్నారు. అంత చిత్తశుద్ధి ఉంటే.. ఎస్సీలు అధికంగా ఉన్న అమరావతి నుంచి రాజధానిని మారుస్తున్న సీఎంపై కేసులు వేయాలని సూచించారు. ప్రజా ప్రయోజనాలకు బదులుగా స్వార్థ రాజకీయాలకు పెద్ద పీట వేస్తున్నందుకే.. కోర్టులతో ప్రభుత్వం తలంటించుకోవాల్సి వస్తోందని ధ్వజమెత్తారు.

కక్ష సాధింపుకే కేసులు

అక్రమ కేసులు నమోదు చేస్తున్న అధికారులు జైలుకు పోకతప్పదని మాజీమంత్రి జవహర్ హెచ్చరించారు. రెండేళ్ల నుంచి వెతుకుతున్నా ఆధారాలు దొరకలేదా అని ప్రశ్నించారు. అధికారం లేనప్పుడే అంతమందితో చిప్పకూడు తినిపించిన సీఎం జగన్.. ఈ సారి వందల సంఖ్యలో అధికారులను జైలు బాట పట్టించడం ఖాయమని దుయ్యబట్టారు. ఇకనైనా పిల్లాటలు మాని ఓటేసిన ప్రజలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఆళ్ల రామకృష్ణారెడ్డితో ఎస్సీ ఎస్టీ కేసు, ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి నవ్వులపాలవ్వడం సిగ్గుగా లేదా అని నిలదీశారు. చంద్రబాబు మీద పగతో పాటు అమరావతిపై కక్షతీర్చుకోవాలన్నది ముఖ్యమంత్రి కోరిక అని మండిపడ్డారు. అసైన్డ్ భూముల కేసులో జగన్ ఆవేశమే తప్ప ఎస్సీల ప్రయోజనం శూన్యమని పేర్కొన్నారు. కక్ష సాధించాలనే ఆత్రుతతో ఎస్సీలను వాడుకోవాలనుకోవటం దుర్మార్గమన్నారు. రెండేళ్లుగా వారికి దక్కాల్సిన రుణాలు, ఉపప్రణాళిక నిధులపై లెక్క చెప్పగలరా అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: 'రాజధాని అమరావతికి స్వచ్ఛందంగానే భూములిచ్చాం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.