రాష్ట్రం నుంచి కర్ణాటకకు బస్సు సర్వీసులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 17 నుంచి బెంగళూరు సహా పలు ప్రాంతాలకు 168 బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నారు . నాలుగు దశల్లో మొత్తం 500 బస్సు సర్వీసులకు పెంచాలని నిర్ణయించారు. రేపటి నుంచి ఆన్‌లైన్‌లో రిజర్వేషన్లు ప్రారంభించనున్నారు. బస్సు స్టేషన్ నుంచి బస్ స్టేషన్ వరకు టికెట్లు బుకింగ్ చేసుకునేందుకే ఆర్టీసీ అవకాశం కల్పించింది.
బస్సుల్లో భౌతిక దూరం, మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడకం తప్పనిసరని ఆర్టీసీ స్పష్టం చేసింది. రాష్ట్రానికి వచ్చిన వారిలో 5 శాతం మంది ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బస్టాండ్లలో కరోనా నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆర్టీసీ ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రొటోకాల్ పాటించాలని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: