ETV Bharat / city

రాష్ట్రంలో ‘స్మార్ట్‌ సిటీ’లకు ఇచ్చిన నిధుల్లో 90% ఖర్చు:కేంద్ర సహాయ మంత్రి - స్మార్ట్‌ సిటీ నిధులపై కేంద్రమంత్రి

‘స్మార్ట్‌ సిటీ’లకు ఇచ్చిన నిధుల్లో 90% ఖర్చయ్యాయని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిశోర్‌ తెలిపారు. అమరావతిలో మాత్రం 21 ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటివరకు ఒక్క పనీ చేపట్టలేదని చెప్పారు. ఇక్కడ ఏ పనీ డీపీఆర్‌ లేదా టెండర్‌ దశలోనూ లేదని వెల్లడించారు.

Smart City
పార్లమెంట్​లో ఏపీ
author img

By

Published : Jul 29, 2022, 9:06 AM IST

స్మార్ట్‌ సిటీస్‌ కింద ఇప్పటి వరకు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల్లో 90% ఖర్చయ్యాయి. 8 ఏళ్లలో రూ.1,873 కోట్లు విడుదలైతే రూ.1,685.14 కోట్లు ఖర్చయినట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిశోర్‌ తెలిపారు. గురువారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. 2015-16 నుంచి ఏటా నిధులు ఇస్తున్నట్లు వెల్లడించారు. స్మార్ట్‌ సిటీలుగా ప్రకటించిన అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నంలలో రూ.7,621.95 కోట్లతో 264 ప్రాజెక్టులు పూర్తిచేయాల్సి ఉంది.

ఇప్పటివరకు రూ.1,903.09 కోట్లతో కాకినాడలో 60, తిరుపతి-35, విశాఖపట్నం-48 ప్రాజెక్టులు పూర్తయ్యాయని వెల్లడించారు. అమరావతిలో మాత్రం 21 ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటివరకు ఒక్క పనీ చేపట్టలేదని చెప్పారు. ఇక్కడ ఏ పనీ డీపీఆర్‌ లేదా టెండర్‌ దశలోనూ లేదని వెల్లడించారు.

పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలు రాష్ట్రంలోనే ఎక్కువ: గత మూడేళ్లలో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలు ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా చోటుచేసుకున్నాయి. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఆధ్వర్యంలోని పరివేష్‌ పోర్టల్‌లో మొత్తం 2,877 పర్యావరణ నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. అందులో 1,280 (44.90%) ఏపీకి సంబంధించినవే ఉన్నాయి. 663 (23.04%) కేసులతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణకు చెందినవి 156 నమోదయ్యాయి. గురువారం రాజ్యసభలో వైకాపా ఎంపీ పరిమళ్‌ నత్వాని అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్‌ చౌబే ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

ఏపీలో అసంఘటిత కార్మికులు 1.50 కోట్లు: ఆంధ్రప్రదేశ్‌లో అసంఘటిత కార్మికులు 1,50,92,950 మంది ఉన్నట్లు అంచనా ఉందని కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్‌ తేలి తెలిపారు. ఈశ్రమ్‌ పోర్టల్‌లో 70,50,561 మందే పేర్లు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. రాజ్యసభలో భాజపా సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఈశ్రమ్‌ పోర్టల్‌లో అత్యధికంగా అనంతపురం జిల్లా నుంచి 6,96,871 మంది నమోదైనట్లు చెప్పారు. ఎన్టీఆర్‌ జిల్లాలో అత్యల్పంగా 11,050 మంది నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి శ్రమ్‌యోగి మాన్‌ధన్‌ యోజన కింద 13 ఉమ్మడి జిల్లాల్లో 1,61,732 మంది, చిరు వ్యాపారులకు ఇచ్చే పింఛను పథకం కింద 5,890 మంది పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

జాతీయ రహదారుల్లో తగ్గిన పాదచారుల ప్రమాదాలు: జాతీయ రహదారుల్లో ప్రమాదాలకు గురయ్యే పాదచారుల సంఖ్య 2019, 2020 సంవత్సరాల్లో ఏపీలో తగ్గగా, తెలంగాణలో పెరిగాయి. లోక్‌సభలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఈ విషయాన్ని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 2019లో 1,238 మంది పాదచారులు ప్రమాదానికి గురికాగా 2020 నాటికి ఆ సంఖ్య 1,137కి తగ్గింది. ఇదే సమయంలో మరణాలు 613 నుంచి 579కి తగ్గాయి.

* ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం షెడ్యూల్‌-13లోని సెక్షన్‌ 93 ప్రకారం ఇరు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య ర్యాపిడ్‌ రైల్‌, రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టులను 2022 ఏప్రిల్‌లో ప్రారంభించి, 2024 ఏప్రిల్‌ నాటికి పూర్తిచేయాల్సి ఉందా? అన్న ప్రశ్నకు గడ్కరీ ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదు.

అక్టోబరు నాటికి కడియపులంక క్లస్టర్‌ ప్రారంభం: కడియపులంక కాయిర్‌ క్లస్టర్‌ ఈ ఏడాది అక్టోబరు 31 నాటికి పూర్తిస్థాయిలో ప్రారంభమవుతుందని కేంద్ర ఎంఎస్‌ఎంఈ సహాయమంత్రి భాను ప్రతాప్‌సింగ్‌ వర్మ తెలిపారు. లోక్‌సభలో ఎంపీ మార్గాని భరత్‌ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఇప్పటికే కొన్ని విభాగాల్లో ఈ క్లస్టర్‌ పని ప్రారంభించిందని, ఇంకా యంత్రాల ప్రయోగాత్మక పరిశీలన పూర్తికాలేదని, అక్టోబరు 31 నాటికి పూర్తిస్థాయిలో పనులు మొదలవుతాయని వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.