తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తుతోంది. అధికారులు ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 2,21,013 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 2,21,013 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటి మట్టం 1,091అడుగులకు చేరి పూర్తి స్థాయిలో నిండింది. నిల్వ నీటి సామర్థ్యం 90.31 టీఎంసీలకు చేరుకుంది.
ఇదీ చూడండి: